Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : చైనాకి బాసటగా నిలుస్తా అంటున్న పెద్దన్న!

By:  Tupaki Desk   |   4 Feb 2020 2:12 PM IST
కరోనా ఎఫెక్ట్ : చైనాకి బాసటగా నిలుస్తా అంటున్న పెద్దన్న!
X
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. చైనా లోని వుహన్‌ లో మొదటగా బయటపడ్డ ఈ వైరస్ ఆ తరువాత కొద్దీ రోజుల్లోనే ప్రపంచంలోని పలు దేశాలలో విస్తరించి ..అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. చైనాలో ఇప్పటికే ఈ కరోనా భారిన పడి 425 మంది మృతిచెందారు. వైరస్ సోకిన వారి సంఖ్య 20 వేల 400 మంది కాగా.. ఇందులో 3 వేల 235 కొత్త కేసులు కావడం గమనార్హం. అలాగే చైనా నుంచి మరో రెండు నగరాలకు కూడా వైరస్ వ్యాపించింది.

హంకాంగ్‌ కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి ఒకరు జనవరి 21వ తేదీన చైనాలోని వుహన్ వెళ్లారు. అక్కడినుంచి తిరిగొచ్చాక , అతను కరోనా వైరస్ బారినపడ్డారు అని సమాచారం. అతనిని వైద్యులు పరీక్షించగా వైరస్ సోకినట్టు గుర్తించారు.ఆ తరువాత ట్రీట్ మెంట్ తీసుకుంటూ మంగళవారం మృతి చెందారు. దీంతో వుహన్‌ నుంచి వైరస్ హంకాంగ్‌ కు వ్యాప్తి చెంది, రోగి మృతిచెందడంతో హంకాంగ్‌ ప్రజలందరూ భయాందోళనకు గురవుతన్నారు. తైవాన్‌ లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని తెలుస్తుంది.

అయితే సోమవారం ఒక్కరోజే 64 మంది ఈ వైరస్ వల్ల చనిపోవడం ఆందోలన కలిగిస్తోంది. మరోవైపు కరోనా వైరస్‌ పై పోరాడేందుకు ముందుకొస్తున్నామని అమెరికా ప్రకటించింది. వైరస్‌ ను సమిష్టిగా కలిసి ఎదుర్కొందామని పిలుపునిచ్చింది. వైరస్‌ పై తమతో కలిసి పోరాడేందుకు ముందుకొచ్చిన అమెరికాని .. చైనా స్వాగతించింది. కరోనా వైరస్ విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినట్టు తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు కేరళలో కూడా మరో కరోనా కేసు నమోదైంది. మూడు కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తంగా ఈ వైరస్ అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువగా వేగంతో విస్తరిస్తుండటంతో దీనిపై ఆందోళన పెరిగిపోతుంది.