Begin typing your search above and press return to search.

క‌రోనా వైర‌స్ కొత్త మార్పు: ఇప్పుడు పేగుల‌పై కూడా తీవ్ర దాడి

By:  Tupaki Desk   |   5 May 2020 9:45 AM IST
క‌రోనా వైర‌స్ కొత్త మార్పు: ఇప్పుడు పేగుల‌పై కూడా తీవ్ర దాడి
X
క‌రోనా వైరస్ మానవ శ‌రీరాన్ని మొత్తం పాకుతోంది. ఇన్నాళ్లు శ్వాస‌కు ఇబ్బంది.. జ్వ‌రం త‌దిత‌ర ల‌క్ష‌ణాలు ఉండ‌గా ఇప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతోంది. మానవ శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఈ విష‌యాల‌నే చాలా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. తాజాగా మ‌రో ప‌రిశోధ‌న మాన‌వుడిలోని పేగుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని తేలింది. పేగులపైన ఇన్‌ఫెక్షన్ చూపిస్తుందని రుజువు చేశారు. పేగుల్లోని కణాల్లో క‌రోనా వైరస్ వృద్ధి చెందుతుందని నెద‌ర్లాండ్ శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కరోనా సోకిన వారిలో డయేరియా వంటి జీర్ణాశయ సంబంధ స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

సాధారణంగా కరోనా ల‌క్ష‌ణాలు అంటే జ్వరం - దగ్గు - తుమ్ములు - శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇప్ప‌టివ‌ర‌కు వీటినే క‌రోనా బాధితుల‌కు ఉంటాయ‌ని తేలింది. అయితే క‌రోనా ఎంత‌కీ త‌గ్గ‌క‌పోవ‌డం.. కేసులు పెరుగుతుండ‌డంతో నెద‌ర్లాండ్‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో కొందరి రోగుల మలంలోనూ వైరస్ నమూనాలను శాస్త్రవేత్త‌లు గుర్తించారు. దాంతోపాటు ఇప్పుడు పేగుల్లో కూడా క‌రోనా ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయ‌ని తాము చేసిన పరిశోధనలో తేలింద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ వైరస్ ప్రవేశానికి వీలు కల్పించే ఏసీఈ2 రెసెప్టర్లు.. పేగుల్లోని కణాల్లో ఉన్నాయని తాజాగా గుర్తించారు. అలా వచ్చిన మ‌హ‌మ్మారి మెల్ల‌గా పైకి వెళ్లి గుండె ప‌నిత‌నంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని తాము చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంద‌ని నెదర్లాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏసీఈ2 రెసెప్లార్ల స్థాయి ఎక్కువగా ఉన్న కణాలపై ఈ వైరస్ దాడి చేస్తున్నట్లు శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఇలా తేలిన వాటిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి.