Begin typing your search above and press return to search.

ఏపీలోనూ కరోనా కల్లోలం.. థియేటర్స్ బంద్

By:  Tupaki Desk   |   13 March 2020 1:30 PM GMT
ఏపీలోనూ కరోనా కల్లోలం.. థియేటర్స్ బంద్
X
తెలుగు రాష్ట్రాల్లో మొదల హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఏపీకి ఇంతవరకూ ఆ ముప్పు లేదని భావించారు. కానీ తాజాగా ఏపీలోని పలువురికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను తాకింది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది.

ఇటలీ నుంచి ఆంధ్రాకు వచ్చిన నెల్లూరు వాసికి కరోనా పాజిటివ్ అని ఫుణె వైరాలజీ ల్యాబ్ నిర్ధారించింది. తిరుపతి స్విమ్స్ లో అతడికి ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారు. ఏపీలో హెల్త్ అలెర్ట్ ప్రకటించారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఈ వ్యక్తి అక్కడి ప్రాంతం లో తిరగడం తో ఆయన కలిసిన వారికి పరీక్షలు చేస్తున్నారు. నెల్లూరులో మూడు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కరోనా వైరస్ తొలి కేసు నమోదైన దృష్ట్యా నెల్లూరులోని సినిమా థియేటర్లు, హోటళ్లు మూసివేయాలని సమావేశం నిర్వహించారు. షాపింగ్ మాల్స్ లో కూడా మాస్కులు ధరించేలా చూడాలని కోరారు. నెల్లూరు వ్యక్తి తిరిగి న ప్రాంతంలో పారిశుధ్య, ఐసోలేషన్ చేశారు. 14మంది కరోనా అనుమానితులను జీజీహెచ్ ఆస్పత్రిలో పరిశీలనలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

ఇక కర్నూలు జిల్లాలో ముగ్గురు కరోనా వైరస్ లక్షణాలతో అనుమానితులను జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. జెరూసలెం, అమెరికా వెళ్లి వచ్చిన మహిళల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. కర్నూలు నుంచి అమెరికా వెళ్లి వచ్చిన వరంగల్ ఎన్ఐటీ విద్యార్థికి లక్షణాలు ఉండడంతో వరంగల్ లో చికిత్స చేస్తున్నారు.

ఇక విజయవాడ లో మరో వ్యక్తి కరోనా సోకిందని అనుమానిస్తున్నారు. ఈ యువకుడు జర్మనీ వెళ్లి విజయవాడలోని గన్నవరానికి వచ్చాడు. ఈ వ్యక్తికి నిర్వహించిన స్క్రీనింగ్ లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ప్రత్యేక అంబులెన్స్ లో ఇంటికే తరలించి చికిత్స చేస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యాక అధికారికంగా ప్రకటించనున్నారు.