Begin typing your search above and press return to search.
కుంభమేళాలో కరోనా కల్లోలం.. అఖాడ మరణంతో ముగింపు!
By: Tupaki Desk | 17 April 2021 11:00 AM ISTదేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. సెకండ్ వేవ్ కారణంగా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గంగానదీ పరివాహకంలో నిర్వహిస్తున్న కుంభమేళాతో కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది కరోనా బారినపడగా.. కుంభమేళాలో మాస్కులు, సామాజక దూరం లేకపోవడంతో కేసులు మరణాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కుంభమేళాను ఆపు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 17న కుంభమేళా ముగిస్తున్నట్టు నిర్వాహకుడు నిరంజని అఖాడా ప్రకటించారు. ఈ కుంభమేళాలో పాల్గొనే 13 మంది అఖడాలలో పంచాయతీ నిరంజని అఖాడా రెండవ అతిపెద్ద వ్యక్తి. ఇప్పటికే పెద్ద అఖాడా అయిన మహమండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ కోవిడ్ -19 కారణంగా మరణించాడు. 65 ఏళ్ల ఆయనకు కోవిడ్ -19 పాజిటివ్ రాగా హరిద్వార్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 13 న ఆయన మరణించాడు.
ఏప్రిల్ 14న మాస సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ప్రధాన షాహి స్నాన్ ముగిసిందని, అఖాడాలో పాల్గొన్న చాలా మందికి కోవిడ్ -19 లక్షణాలను వచ్చాయని నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి గురువారం ప్రకటించారు. తీవ్రత ఎక్కువ కావద్దనే కుంభమేళా ముగిసిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్రగిరితో సహా 68 మందికి పైగా కోవిడ్ పాజిటివ్ గా పరీక్షించబడ్డారని తేలింది. ఈ కుంభమేళాలో పాల్గొన్న సాధువులు పెద్దఎత్తున పాజిటివ్ గా పరీక్షించబడ్డారు. హరిద్వార్‌లో 2,170 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. హరిద్వార్ లోని కుంభమేళా సాధారణంగా నాలుగు నెలలు జరుగుతుంది. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా దీనిని ఒక నెలకు తగ్గించారు.
