Begin typing your search above and press return to search.

అంబానీ నష్టం 36 వేల కోట్లు ....

By:  Tupaki Desk   |   6 March 2020 11:05 AM IST
అంబానీ నష్టం 36 వేల కోట్లు ....
X
కరోనా వైరస్ ..ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ మహమ్మారి ప్రస్తుతం 89 దేశాలకి వ్యాప్తిచెంది, ఆ దేశాల ప్రజలని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 3 , 359 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తున్న ఈ కరోనా ..ప్రపంచ కుబేరులపై తన ప్రతాపాన్ని చూపించింది. ఈ కరోనా దెబ్బకి అపర కుబేరుల కోట్ల కొలది సొమ్ము ...రోజుల వ్యవధిలో ఆవిరిగా మారిపోయింది. కరోనా దెబ్బకి గత కొన్ని రోజులుగా మార్కెట్లు భారీ పతనం దిశగా సాగుతుండటంతో సాధారణ ఇన్వెస్టర్లకు మాత్రమే కాక కోటీశ్వరులకు సైతం కోట్ల రూపాయల సంపద పోయింది.

ఈ కరోనా ప్రభావం తో ఇప్పటివరకు మొత్తంగా 73 . 3 లక్షల కోట్ల సంపద ఆవిరిగా మారిపోయింది. అలాగే మైక్రో సాఫ్ట్ , ఆపిల్ వంటి సంస్థలు కూడా భారీ నష్టాలని చవిచూస్తున్నాయి. కేవలం సంస్థలపైనే కాకుండా ఈ కరోనా ప్రభావం ప్రపంచంలోని టాప్ 500 ధనికుల పై కూడా పడింది. ఈ వైరస్ కారణంగా వీరందరి ఆస్తిలో లో దాదాపుగా 32 లక్షల కోట్ల సంపద పోయిందని అంచనా వేస్తున్నారు. అందులో దాదాపుగా 3 లక్షల కోట్లు ప్రపంచంలో టాప్ 3 ధనికులు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌‌‌‌గేట్స్, ఎల్‌‌‌‌వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్డ్‌‌‌‌ లదే.

ఇక మన దేశంలోని కుబేరుల విషయానికొస్తే ..ముకేశ్ అంబానీ రెండు నెలల్లోనే రూ. 37 వేల కోట్ల సంపదను నష్టపోయారు. ఇందులోనూ ఎక్కువ భాగం గడిచిన 15 రోజుల్లోనే నష్టం వాటిల్లింది. ఈ అపర కుబేరుడిని చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారీగా దెబ్బకొట్టిందని చెప్తున్నారు. కరోనా వైరస్‌ దెబ్బతో ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా రూ.6,374 కోట్లు , అదానీ గ్రూపు అధినేత గౌతమ్‌ అదానీ 3655 కోట్ల సంపదని కోల్పోయారు. వీరితో పాటు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చీఫ్‌ ఉదయ్‌ కొటక్‌, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ కూడా భారీగా నష్ట పోయారు. మొత్తం ఈ కరోనా వైరస్ ఈ ప్రపంచంలోని ఎవరిని వదిలి పెట్టడంలేదు.