Begin typing your search above and press return to search.

ముఖేష్ అంబానీని సైతం షేక్ చేసిన వ్యాధి

By:  Tupaki Desk   |   29 Feb 2020 9:50 AM IST
ముఖేష్ అంబానీని సైతం షేక్ చేసిన వ్యాధి
X
ప్రపంచంలోనే 9వ అతిపెద్ద కుబేరుడు మన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. భారత దేశంలో నంబర్ 1 సంపాదనపరుడు ఈయనే. అలాంటి ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లుకు చేరడం విశేషం. ఈయన గంటకు సంపాదించే మొత్తమే ఏకంగా 7 కోట్లు. గంటకు 7కోట్లు సంపాదించే కుబేరుడు ముఖేష్ అంబానీ అని తెలిసి అందరూ తాజాగా నోరెళ్ల బెట్టారు.

అయితే గంటకు 7 కోట్లు సంపాదించే అపర కుబేరుడు ముఖేష్ అంబానీని కూడా షేక్ చేసిందో ఓ వ్యాధి. అదే కరోనా వైరస్. అవును కరోనా వైరస్ కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద విలువ గత ఏడాది కంటే 5 బిలియన్ డాలర్లు తగ్గింది. ఈ మేరకు స్టాక్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి.

ఫిబ్రవరి 12 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 13శాతం విలువ కోల్పోయాయి. 2019తో పోలిస్తే అంబానీ సంపద 5 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది.ఆదిత్యబిర్లా సంపద 884 మిలియన్ డాలర్లు గా ఉంది. అజీమ్ ప్రేమ్ జీ సంపద 869 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఆయా కంపెనీల వాటాల విలువలు తగ్గాయి. దీనికంతటికి కరోనా వైరస్ ప్రభావమే కారణంగా చెబుతున్నారు. వైరస్ కారణంగా కొనుగోలు, అమ్మకాలు పడిపోవడమే రిలయన్స్ నష్టాలకు కారణంగా చెబుతున్నారు.