Begin typing your search above and press return to search.
అనుకున్నంత త్వరగా ఏమీ కరోనా సిరీస్ ముగియదా?
By: Tupaki Desk | 24 April 2020 11:00 AM ISTకంటికి కనిపించని కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎన్నో కొత్త అనుభవాల్ని ఎదుర్కొంటోంది. రోజుల తరబడి లాక్ డౌన్ లో ఉండిపోయిన దేశాలు.. ఆయా దేశ ప్రజలు విసిగిపోతున్నారు. మొదట్లో లాక్ డౌన్ టాస్కును ప్రపంచంలోని పలు దేశాల వారు సరదాగా.. రోటీన్ కు ఆటవిడుపుగా తీసుకున్నారే కానీ దాని సీరియస్ నెస్ ఏమిటన్నది పెద్దగా పట్టించుకోలేదు. దీనికి భారీగా మూల్యాన్ని చెల్లించుకున్నాయి పలు దేశాలు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు.. పలు దేశాలకు చెందిన ప్రజలు కొందరు కరోనా ముప్పును అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో వారు.. వారి కుటుంబాలకు పెనుముప్పుగా మారటం తెలిసిందే.
ఇంతకూ సాధారణ పరిస్థితులు ఎప్పుడు చోటు చేసుకుంటాయన్నది ఒక పట్టాన క్లారిటీ రావటం లేదు. పలు దేశాలు లాక్ డౌన్ ను ఎత్తి వేసే దిశగా సమాచాలోచనలు జరుపుతున్నాయి. కొన్ని దేశాలు లాక్ డౌన్ ను ఎత్తేశారు కూడా. అయితే.. అలాంటి దేశాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ తెర మీదకు రావటంతో.. ఆగమాగం అవుతున్నారు. మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయిస్తున్నారు.
లాక్ డౌన్ ను ఎప్పుడు ఎలా ఎత్తి వేయాలన్నది ఇప్పుడు పెద్ద ఫజిల్ గా మారింది. ఇలాంటివేళలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ తప్పు చేయొద్దు.. వైరస్ సుదీర్ఘకాలం మనతోనే ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా దేశాలు లాక్ డౌన్ ను సడలించాలన్న ఆలోచనలో ఉండి ఉంటే.. దాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన కోరుతున్నారు.
ప్రస్తుతానికి చాలా దేశాల్లో కరోనా ప్రాథమిక దశలోనే ఉందని.. రానున్న రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందంటూ పెద్ద బాంబే పేల్చారు. రానున్న కాలంలో అమెరికా.. ఆఫ్రికా.. లాంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరిన్ని పెరగనున్నట్లు చెప్పారు. మొదట్లో కరోనా కేసుల బారిన పడిన దేశాలు కోలుకున్నట్లు కనిపించినా.. ఏ మాత్రం తప్పులు చేసినా.. కరోనా బారిన పడటం ఖాయమని తేల్చారు. ప్రస్తుతం పశ్చిమ ఐరోపా దేశాల్లో కేసుల తీవ్రత తగ్గినా.. ఆఫ్రికా.. మధ్య దక్షిణ అమెరికాతో పాటు తూర్పు ఐరోపా దేశాల్లో వైరస్ తీవ్రత రానున్న రోజుల్లో పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరలే స్వయంగా చెప్పిన ఈ మాటల్ని చూసినప్పుడు కరోనా సిరీస్ ఇప్పట్లో ముగిసేలా లేదని చెప్పక తప్పదు.