Begin typing your search above and press return to search.

కరోనా: హైదరాబాద్ లో బెడ్ల కొరత

By:  Tupaki Desk   |   16 April 2021 12:30 AM GMT
కరోనా: హైదరాబాద్ లో బెడ్ల కొరత
X
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా దారుణంగా ఉందని తెలుస్తోంది. కరోనా ఉగ్రరూపం ధాటికి భారీగా ప్రాణాలు పోతున్నాయి.

కరోనా ధాటికి హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లో బెడ్స్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్స్ అన్నీ కూడా పేషెంట్లతో నిండిపోయాయి. హైదరాబాద్ లో ఇప్పుడు రికమండేషన్ లేనిదే ఒక్క బెడ్ కూడా దొరికే పరిస్థితి లేదట.. అపోలో లాంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో అయితే పెద్ద ఫైరవీలే కావాల్సి వస్తోంది.

ఇక మామూలు ఆస్పత్రులకు రోగుల తాకిడి తీవ్రంగా ఉంది. లకిడికపూల్ లోని ఓ ఆస్పత్రిలో కరోనా కోసం 40 బెడ్స్ సిద్ధం చేస్తే అన్నీ నిండిపోయాయి. దీంతో ఆస్పత్రి ఇక చేర్చుకోమని బోర్డు పెట్టేసింది. దాదాపు హైదరాబాద్ లోని చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ప్రైవేటు ఆస్పత్రులకు ఈ కరోనా ట్రీట్ మెంట్ కు అనుమతిచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఏర్పడడం ఖాయమంటున్నారు.

ఇక ఏపీలోనూ బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీలైనన్ని బెడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. బెడ్ల కొరతతో బాధితులు అల్లాడుతున్నారు. జిల్లాల వారీగా బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలని జిల్లా అధికారులు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.