Begin typing your search above and press return to search.

డేంజర్ : కూల్ డ్రింక్స్ తో కరోనా.. ఇలా వస్తుందట.?

By:  Tupaki Desk   |   14 Aug 2021 12:01 PM IST
డేంజర్ : కూల్ డ్రింక్స్ తో కరోనా.. ఇలా వస్తుందట.?
X
కరోనా కారణంగా రెండు సంవత్సరాలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. గత సంవత్సరం కొన్ని రోజులు ప్రారంభించాక వైరస్ కేసులు పెరగడంతో మళ్లీ మూసేశారు. ఈ ఏడాది ధర్డ్ వేవ్ ముప్పు ఉందన్న నేపథ్యంలో కొన్ని కళాశాలలను ప్రారంభించినా స్కూల్ గేట్లు మాత్రం తీయడం లేదు. స్టడీ ఇయన్స్ వృథా అయినా తమ పిల్లల ప్రాణాలు ముఖ్యమని చాలా మంది తల్లిదండ్రులు బడుల్లోకి పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలుసైతం పిల్లలపై ఒత్తిడి లేకుండా తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేస్తున్నారు. దీంతో చాలా మంది ఆన్లైన్ క్లాసుల్లోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ కొందరు విద్యార్థులు స్కుల్ కు డుమ్మా కొట్టడానికి కరోనా వైరస్ ను కావాలనే తెప్పించుకుంటున్నారట. అదేలా సాధ్యమనే సందేహం చాల మందికి రావచ్చు. కానీ కొందరు వైద్య నిపుణులు దీనిని నిర్దారించారు.

ఒకప్పుడు స్కూల్ కు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థులు ఎప్పుడు వర్షం వస్తే బాగుండునని కోరుకునేవారు. కానీ నేటి కాలంలో చదువుపై అవగాహన పెరగడంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వారి ప్రవర్తనతో పాటు వారు చేసే పనులపై నిఘా పెడుతున్నారు. దీంత ఎక్కడో చోట తప్ప చాలా మంది బడిబాట పడుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తరువాత స్కూల్ కు వెళ్లడానికి విద్యార్థులు ఇంట్రస్టు చూపడం లేదు. వైరస్ కారణంగా ఆన్లైన్ క్లాసులు చెప్పినా విద్యార్థులు ఫాలో కావడం లేదు. దీంతో తల్లిదండ్రులు వారిని నేరుగా స్కూల్ కు పంపేందుకు దృష్టి పెడుతున్నారు.

కానీ కొందరు విద్యార్థులు కావాలనే కరోనాను తెచ్చుకుంటున్నారట. అంటే తమకు పాజిటివ్ రిపోర్టు వచ్చేలా గేమ్ ఆడుతున్నారట. వీరు ఇలా చేయడం చూసి తల్లిదండ్రులతో పాటు వైద్యులు కూడా షాక్ తిన్నారు. ఇంతకీ వారు కృత్రిమంగా కరోనా పాజిటివ్ ను ఎలా తెచ్చుకున్నారు..? కరోనా పాజిటివ్ అని తేలడానికి వారు ఏం చేశారో తెలిస్తే షాక్ తింటారు. కోలా, జ్యూస్ లు ఉపయోగించి తప్పుడు రిపోర్టు తెచ్చుకుంటున్నారట. కరోనా నిర్దారణ పరీక్షల్లో ఒకటైన ఫ్లో టెస్ట్ (ఎల్ ఎఫ్ టీ) ద్వారా తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకున్నట్లు తేలింది.

కొంతమంది వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్ ఎఫ్ టీ టెస్టు కిట్ లలో కోలా, ఆరెంజ్ జ్యూ చుక్కలు వేశారట. కొన్ని నిమిషాల తరువాత రెండు కిట్లలోకరోనా వైరస్ ఉనికి ఉన్నట్లు కనుగొన్నామని తెలిపారు. ఎల్ఎఫ్ టీ లో నిట్రో సెల్యూలోస్ అనే కాగితం ఉంటుంది. దానితో పాటు ఎరుపు రంగు ఫ్యాడ్ ఉంటుంది. ఈ రెండూ కూడా టీ-లైన్ కు కింద భాగంలో ప్లాస్టిక్ కేస్ ను లోపల అమర్చి ఉంటాయి. రెడ్ ప్యాడ్ యాంటీ బాడీలను పీల్చుకుంటుంది. ఇవి గోల్డ్ నానో పార్టికల్స్ తో కూడా జత కలుస్తాయి. ఈ పరీక్ష చేస్తున్నప్పుడు శాంపిల్ ను లిక్విడ్ బఫర్ ద్రావణంలో కలపాలి. ఇలా చేయడం వల్ల శాంపిల్ పీహెచ్ విలువ తగు మోతాదులో ఉంటుంది. ఆ తరువాత 15 నిమిషాల్లో ఫలితం తెలుసుకోవచ్చు. వైరస్ ఉంటే సీ,టీ గీతలు రెండు ఎరుపు రంగులోకి మారుతాయి. లేకపోతే సీ మాత్రమే ఎరుపు రంగులో ఉంటుంది.

అయితే సీ, టీ రెండూ ఎరుపు రంగులోకి ఎలా మారుతున్నాయి..? అనేది వైద్యులు తేల్చారు. సాఫ్ట్ డ్రింగ్ లో ఏదో పదార్థం యాంటీ బాడీల పనితీరును ప్రభావితం చేస్తుంది. కరోనా పరీక్షల ఫలితాలను తారుమారు చేస్తోన్న పళ్ల రసాలు, కోలా ఇలా చాలా ద్రవాలు ఒక సాధారణ అంశాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఆమ్ల పూరిత ద్రవాలు. ఈ పానీయాలకు 2.5 నుంచి 4 వరకు పీహెచ్ విలువను అందిస్తాయి. ఇవి యాంటీ బాడీల పనితీరుకు చాలా కఠినమైన పరిస్థితులు. యాంటీ బాడీలు సాధారణంగా రక్త ప్రవాహంలో న్యూట్రల్ పీహెచ్ విలువ 7.4 వద్ద పనిచేస్తాయి. మొత్తానికి ఆమ్లపూరిత పరిస్థితుల్లో ప్రోటీన్ పూర్తిగా పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. దీంతో కరోనా పాజిటివ్ రిపోర్టు వస్తుంది.