Begin typing your search above and press return to search.

ఏసీలతో కరోనా..! జరభద్రం..

By:  Tupaki Desk   |   12 Feb 2021 5:00 AM IST
ఏసీలతో కరోనా..! జరభద్రం..
X
ఈరోజుల్లో ఏసీలు ఉండటం సర్వసాధారణ విషయం అయిపోయింది. ఆఫీసులు, రెస్టారెంట్లు ఇలా ప్రతిచోట ఏపీ ఉంటున్నది. మధ్యతరగతి ప్రజలు కూడా తమ ఇళ్లలో ఏసీలు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏసీ (ఎయిర్​కండిషన్లు) వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజలెవరూ రెస్టారెంట్లకు వెళ్లొద్దని అమెరికాలోని మిన్నెసోటా వర్సిటీ సైంటిస్టులు అక్కడి ప్రజలకు సూచించారు. చైనాలోని ఓ రెస్టారెంట్​లోని ఏసీ ద్వారా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో సైంటిస్టులు అలర్టయ్యారు.

సాధారణంగా కరోనా వైరస్​ నోటి నుంచి వచ్చే తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్​ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, లేదా తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపరల ద్వారా ఈ వైరస్​ గాల్లోకి వెళ్లి.. అక్కడి నుంచి ఇతరులకు సోకుతున్నది. కరోనా వైరస్​ ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు సిమ్యులేషన్‌ పరిజ్ఞానాన్ని సూపర్‌ కంప్యూటర్ల ద్వారా పరీక్షించారు.

అయితే రెస్టారెంట్‌లోని ఏసీ నుంచి విడుదలయ్యే చల్లని గాలి, డైనింగ్‌ టేబుల్‌ పరిసర వాతావరణంలో ఉన్న నీటితుంపరల కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. ఏసీల్లో పిల్లరేషన్ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల .. గదిలోనే కరోనా వైరస్​ ఉండిపోయి.. అక్కడి వెళ్లిన వాళ్లకు సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఓపెన్​ రెస్టారెంట్ల వల్ల కరోనా తక్కువగా సోకుతుందని వాళ్లు అంటున్నారు.