Begin typing your search above and press return to search.

కరోనా: ప్రోనింగ్ అంటే ఏంటి? ఈ పద్ధతితో ఆక్సిజన్ అవసరం లేదా!

By:  Tupaki Desk   |   29 April 2021 12:30 AM GMT
కరోనా: ప్రోనింగ్ అంటే ఏంటి? ఈ పద్ధతితో ఆక్సిజన్ అవసరం లేదా!
X
దేశంలో కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో చాలామంది ఆక్సిజన్ అందక మృతి చెందుతున్నారు. ప్రాణ వాయివు కొరతతో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వీటికి చెక్ పెట్టేలా ఓ పురాతన పద్ధతి తెరమీదకు వచ్చింది. కరోనా వేళ ప్రోనింగ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. బోర్లా పడుకొని ఇలా చేయాలి అంటూ ప్రోనింగ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ ప్రోనింగ్ అంటే ఏంటో తెలుసా?

ప్రోనింగ్
ఊపిరి ఆడనపుడు బోర్లా పడుకోవడం పురాతన పద్ధతి. దీనిని చాలా కాలం నుంచి పాటిస్తున్నారు. వైద్య పరిభాషలో ఈ పద్ధతిని ప్రోనింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి శ్వాస వేగం పెరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోని ద్రవాలు కలిగి ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ వచ్చి చేరుతుంది. ఊపిరితిత్తులు ఎక్కువభాగం వెనకభాగంలోనే ఉంటాయి. బోర్లా పడుకోవడం వల్ల అన్ని భాగాలు పనిచేసి చురుగ్గా పని చేస్తాయి. ఇలా శ్వాసవేగం పెరిగి ప్రాణ వాయువు అందుతుంది.

కరోనా నుంచి కాపాడుతుందా?
కరోనా బాధితులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఆస్పత్రుల్లోనూ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. బోర్లా పడుకున్న వ్యక్తుల్లో శ్వాసవేగం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని జాగ్రత్తలతో ఈ పద్ధతిని అనుసరిస్తే శ్వాస సంబంధ సమస్యలకు ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఇక కరోనా బాధితులకు ఇలా చేస్తే చాలావరకు ఆక్సిజన్ బయట నుంచి ఇచ్చే అవసరం లేదు అని చెబుతున్నారు. దీనిని సమర్థవంతంగా నిర్వహించడానికి నలుగురు వ్యక్తులు అవసరం అని తెలిపారు.

జాగ్రత్తలు అవసరం
ప్రోనింగ్ పద్దతితో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరు బోర్లా పడడానికి కష్టపడతారు అని అన్నారు. ఊబకాయం ఉన్నవారిని పడుకోబెట్టడం కష్టమని చెప్పారు. ఇకపోతే ఛాతికి గాయాలున్నావారు, ఇతర గుండె సంబంధ సమస్యలున్న వారికి ఇది చేయకూడదని వివరించారు. కొన్ని సార్లు ఊపిరి అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

పురాతన పద్ధతి
ఈ పద్ధతిని చాలా కాలంగా ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. తొలుత చాలామంది ఈ పద్ధతిని వ్యతిరేకించినా క్రమంగా సముఖత చూపుతున్నారు. ప్రోనింగ్ తో శ్వాస మెరుగుపడుతుందని గుర్తించారు. అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఊపిరి కష్టమైనప్పుడు తగు జాగ్రత్తలతో ఈ పద్ధతిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.