Begin typing your search above and press return to search.
ల్యాబ్ నుంచే కరోనా పుట్టింది.. డెలీ మెయిల్ సంచలన కథనం
By: Tupaki Desk | 31 May 2021 11:08 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ 19 వైరస్ పుట్టింది చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే అన్న అనుమానాలు.. అందుకు సంబంధించిన పలు కథనాలు ఇప్పటికే పబ్లిష్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కొత్త ఆధారాలతో.. సరికొత్త లాజిక్కులతో.. మరింత సమాచారంతో బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ డెలీ మొయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అందులో కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందన్న విషయాన్ని స్పష్టం చేసింది. కరోనా వైరస్ దానికదే సహజంగా పుట్టలేదని.. దాన్ని చైనా ల్యాబ్ లోనే క్రియేట్ చేశారని స్పష్టం చేసింది.
ఈ మేరకు బ్రిటన్ కు చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్ ఆంగస్ డాల్గ్లేశ్.. నార్వేకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ బిర్గర్ సోరెన్సెన్ జరిపిన సంయుక్త పరిశోధన అంశాల్ని తమ కథనంలో వెల్లడించింది. ఈ ఇరువురు జరిపిన అధ్యయన రిపోర్టును త్వరలోనే ప్రముఖ సైన్సు పత్రికలో కూడా త్వరలో పబ్లిష్ కానున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ డెలీ మెయిల్ కథనంలోని అంశాలేమిటి? అన్న విషయంలోకి వెళితే..
వూహాన్ లోని వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ ప్రాజెక్టులో భాగంగా కొత్త వైరస్ ను అక్కడి శాస్త్రవేత్తలు కృత్రిమంగా సృష్టించారు. ఈ వైరస్ తయారీకి తమ దేశంలోని గుహల్లో ఉండే గబ్బిల్లాల్లోని కరోనా వైరస్ ప్రాథమిక స్పైక్ ప్రొటీన్ను తీసుకున్నారు. ఇంతకీ ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ ప్రాజెక్టు అంటే ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఈ ప్రాజెక్టును మానవాళి మేలు కోసం స్టార్ట్ చేశారు. అంటే..రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే వైరస్ లను భవిష్యత్తులో ఏ పరిణామ క్రమంలో ఉంటాయి? అలాంటి ప్రమాదాల్ని ఎలా నివారించాలన్న మార్గాల్ని పరిశోధించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
ఈ ప్రాజెక్టులో మరో కీలక అంశం ఏమంటే.. సహజంగా పుట్టిన వైరస్ శక్తిని కృత్రిమంగా పెంచుతారు. ఈ తరహా ప్రాజెక్టులతో ప్రమాదం పొంచి ఉండొచ్చన్న భయంతో అమెరికా మాజీ అధ్యక్షుడు తన పదవీ కాలంలో ఇలాంటి పరిశోధనలపై నిషేధాన్ని విధించారు. చైనా మాత్రం తన మొండితనంతో వీటిని కొనసాగించింది. తాజాగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రాజెక్టును చేపట్టటానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న బయోసేఫ్టీ 3 ఏ మాత్రం సరిపోదు. అయినప్పటికీ.. చైనా శాస్త్రవేత్తలు మాత్రం బయోసేఫ్టీ 3 విభాగంలో కరోనా వైరస్ ను కృత్రిమంగా సృష్టించారు.
అనూహ్యంగా ఈ వైరస్ లీక్ అయ్యింది. అయితే.. చైనా అధికారులు కావాలనే ఈ వైరస్ ను లీక్ చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తప్పుడు ప్రయోగాల్ని వ్యతిరేకించిన ల్యాబ్ లోని శాస్త్రవేత్తల్ని చైనా అధికారులు బెదిరింపులకు గురి చేశారు. అప్పటికి లొంగని వారిని కనిపించకుండా చేశారు. ల్యాబ్ నుంచి లీకైన వైరస్.. తమ అంచనాలకు మించి ఉండటం.. ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేయటంతో ప్రపంచ దేశాలు.. ఈ వైరస్ పుట్టక గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. దర్యాప్తునకు ఒత్తిడి చేయటంతో తప్పును కప్పి పుచ్చుకోవటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.
ఇందులో భాగంగా కరోనా సహజంగా ఏర్పడినట్లుగా నకిలీ ఆధారాల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అందుకే చైనాలో తొలి కరోనా కేసు నమోదైన బాధితుడిలో కనిపించిన వైరస్ నమూనాల సమాచారాన్ని కొంతకాలం చైనా విడుదల చేయలేదు. కొన్ని నెలల తర్వాత తాము అనుకున్నట్లుగా తప్పుడు తరహాలో రూపొందించిన ఆధారాల్ని విడుదల చేశారు. ఇదంతా నిజమే అనుకుందాం. ఇప్పటివరకు ఎవరూ చేయలేని రీతిలో.. కొవిడ్ 19 వైరస్ ను కృత్రిమంగా సృష్టించారని ఎలా తేల్చారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
దీనికి అందరూ ఓకే అనే సమాధానాన్ని ఇస్తున్నారు తాజా అధ్యయనకారులు. సహజంగా ఏర్పడిన వైరస్ స్పైక్ ప్రోటీన్లలో ఒకటి లేదంటే రెండు పాజిటివ్ చార్జ్ అమైనో యాసిడ్ లు ఉంటాయి. అత్యంత అరుదుగా మూడు చూడొచ్చు. కానీ.. కరోనా స్పైక్ ప్రోటీన్ లో నాలుగు అమైనో యాసిడ్ లు ఉంటాయి. సాధారణ వైరస్ ను ల్యాబ్ లో కృత్రిమంగా తయారు చేస్తేనే నాలుగు పాజిటివ్ చార్జ్ అమైనో యాసిడ్ లు ఏర్పడతాయని చెబుతున్నారు. అంతేకాదు.. మామూలు వైరస్ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుందని.. కృత్రిమ వైరస్ కు వేగం ఎక్కువని.. తీవ్రత కూడా ఎక్కువని చెబుతున్నారు. ఈ వివరాలన్ని చూసిన తర్వాత కరోనా వైరస్ పాపం చైనాదేనన్న విషయంపై పూర్తి నమ్మకం కలుగక మానదు.