Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ ముప్పు వారికేనా ...?

By:  Tupaki Desk   |   6 March 2020 2:30 PM GMT
కరోనా వైరస్ ముప్పు వారికేనా ...?
X
దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తమకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆసుపత్రులకు వచ్చే వారికి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. తాజాగా ఢిల్లీకి చెందిన మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారించారు. ఇటీవల థాయ్‌లాండ్, మలేసియా వెళ్లొచ్చిన ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 31కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 వేల మంది కరోనా వైరస్ బారినపడగా...3 , 359 మంది మృత్యువాతపడ్డారు.

ఈ సమయం లో కరోనా వైరస్‌ పై భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతీయ శాస్త్రవేత్త గగన్‌ దీప్ కాంగ్ సూచించారు. కరోనా వైరస్‌ ను తట్టుకునే శక్తి భారతీయులకు అధికం గా ఉందని చెప్పారు. ప్రస్తుతం క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న ఆమె...నార్వో కేంద్రంగా పనిచేస్తున్న అంటువ్యాధుల సన్నద్ధత కార్యక్రమం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. కరోనా కూడా సాధారణమైన వైరస్ అని , దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.

కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదుగురిలో నలుగురికి ప్రత్యేక వైద్యం అవసరం లేకుండానే కోలుకుంటారని పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గగన్‌ దీప్ తెలిపారు. అంతగా అవసరమైతే సాధారణ జలుబు, జ్వరానికి వాడినట్లే పారాసెటిమల్ వాడితే సరిపోతుందన్నారు. కరోనా వైరస్ విషయంలో ఆ ఒక్క కేటగిరీలో మాత్రమే ఆందోళన అవసరమని...ఆ కేటగిరీలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు ఉన్నట్లు చెప్పారు. కోవిడ్ 19 వల్ల చిన్నారులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.