Begin typing your search above and press return to search.
బెంగళూరు గూగుల్ ఉద్యోగికి కరోనా.. ఉద్యోగులంతా ఇంటికి..
By: Tupaki Desk | 13 March 2020 11:35 AM ISTప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ వేళ్లూనుకుంటోంది. మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది. భారత్ లో ఇప్పటికే 75మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారికి ఎక్కువగా కరోనా పాజిటివ్ అని తేలుతోంది. వారే కరోనాను భారత్ కు తీసుకువస్తున్నారు.ప్రతిరోజు ఏదో ఒక చోట కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.తాాజాగా బెంగళూరు లో మరో కేసు నమోదైంది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ సోకింది. అతడిని ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు.
బెంగళూరులో ఉన్న గూగుల్ క్యాంపర్ లో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు ఈ ఉదయం నిర్ధారణ కావడంతో ఉద్యోగులంతా వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ వర్క్ ఫ్రం హోమ్ అనుమతులు మంజూరు చేస్తూ గూగుల్ బెంగళూరు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మీడియాకు, ఉద్యోగులకు ప్రకటన విడుదల చేసింది.
ఇక ఈ ఉద్యోగితో కలిసి పనిచేసిన అందరి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. వారి కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించామని.. పరీక్షలు చేశాక వారికి కరోనా సోకిందా లేదా అని నిర్ధారించుకొని చికిత్స చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతానికి కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారిని అబ్జర్వేషన్ లో ఉంచారు. వారందరినీ మరెవరితోనూ కలవకుండా విడిగా ఉంచామని ప్రభుత్వం తెలిపింది. సంస్థలో పనిచేసే వారి ఆరోగ్యం , క్షేమం కోసం తమకు అత్యంత ప్రాధాన్యమని అందుకే వర్క్ ఫ్రం హోమ్ పంపామని గూగుల్ సంస్థ తెలిపింది.