Begin typing your search above and press return to search.

అయ్య బాబోయ్ హోటల్ పేరు ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’.. అట!

By:  Tupaki Desk   |   5 Nov 2020 2:00 PM IST
అయ్య బాబోయ్ హోటల్ పేరు  ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’.. అట!
X
కరోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి మనుషుల జీవితాల్లో వింతలు, విశేషాలు ఎక్కువయ్యాయి. కరోనా పేరు చెప్పి ఏదో ఒక సంచలన విషయాలు వెల్లడించడం మామూలైంది. జనాలు కూడా ఏది నిజం..ఏది అపద్దం అనేది పట్టించుకోకుండా అన్ని నమ్మేస్తున్నారు. కొందరైతే కరోనా పేరు చెప్పి వ్యాపారాలు చేసుకోవడం కూడా మొదలు పెట్టారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ టిఫిన్ హోటల్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే దాని పేరు ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’ కావడమే. పైగా ఆ హోటల్ కు లివప్ ద ట్రెండ్ అనే ఓ క్యాప్షన్ కూడా ఉంది. ఈ హోటల్ని కొత్తగా నిర్మించగా.. దానిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు హోటల్ నిర్వాహకులు ఈ వెరైటీ పేరును ఎంచుకున్నారు. వారు చేసిన పని వారికి విజయాన్ని అందించింది. కరోనా కాలం కాబట్టి ఆ ప్రాంతంలో హోటల్ కి ఈ పేరు పెట్టగానే అది ఫేమస్ అయ్యింది. హోటల్ కి ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’ అని సోషల్ మీడియాలో దానిపైన కుళ్ళు జోకులు వేస్తున్నారు. ఎలాగైతేనేమి ఆ హోటల్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ యాంటీవైరస్ టిఫిన్ సెంటర్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
'హోటల్ కు వెళ్తే టిఫిన్లలో శానిటైజర్ కలపరు కదా’ అని కొందరు, వంట మాస్టర్ మాస్క్, గ్లౌజులు ధరించకుండా వంట చేస్తే, సర్వర్లు కూడా అలాగే వడ్డిస్తారేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగైతే నేమీ నిర్వాహకులు పెట్టిన పేరు అందరికీ నచ్చింది. హోటల్ కు వచ్చిన వారు దీని గురించి చర్చించుకుంటున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారి కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’ నేమ్ కూడా ఆకర్షిస్తోంది. కొన్ని పాటల్లో పసందైన వంటతో ఫేమస్ అవుతుండగా..కొన్ని ఇలా సరదా పేర్లతో జనం చంపకు చేరుతున్నాయి. ఇంతకు ఈ వెరైటీ హోటల్ కి వెళ్తే కూర్చోవడానికి చైర్లు కూడా లేవు. నిల్చొని తినాల్సిందే.