Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ ల్యాబ్ లో తయారుకాలేదు : డబ్ల్యూహెచ్ఓ

By:  Tupaki Desk   |   10 Feb 2021 4:00 PM IST
కరోనా వైరస్ ల్యాబ్ లో తయారుకాలేదు : డబ్ల్యూహెచ్ఓ
X
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి చైనా ల్యాబ్ లో తయారు కాలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా విజృంభణ కి మూలకారణం చైనానే అంటూ పలు రకాల వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి నీ ల్యాబ్ లో సృష్టించింది కాదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ మహమ్మారి ఎక్కడ పుట్టింది అనే దాని పై మరింత అధ్యాయనం అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం వెల్లడించింది.

వుహాన్‌ ఇన్ ‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో అనేక రకాల వైరస్‌ శాంపుల్స్ ‌ను స్టోర్ చేశారు. అక్కడి నుంచి లీకైన కరోనా, సమీప ప్రాంతాల్లోకి వ్యాపించి ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చైనా ఖండించి వైరస్‌ మరెక్కడో పుట్టి ఉంటుందని పేర్కొంది. దీనిపై కన్ఫర్మేషన్ కోసం మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన ఎక్స్ ‌పర్ట్ టీం జనవరి 14న వుహాన్‌ చేరుకుంది.

మొదట కరోనా కేసులు వెలుగు చూసిన హువానన్‌ సీ ఫుడ్‌ మార్కెట్‌ సహా అనేక ప్రాంతాల్లో సెర్చింగ్ చేసింది. తాజాగా చైనా సైంటిస్టులతో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడింది. మహమ్మారి తొలి రోజులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అవగాహన.. పర్యటనతో పెద్దగా మారలేదని డబ్ల్యూహెచ్‌వో బృందం నాయకుడు పీటర్‌ బెన్‌ ఎంబ్రేక్‌ చెప్పారు.

వూహాన్ మార్కెట్ లో గడ్డ కట్టిన మాంసం నుండి వైరస్ పుట్టి ఉండవచ్చు అని స్పష్టం చేశారు. అయితే కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, నేరుగా మనుషులకే సోకిందా అనే విషయం నిర్ధారించడం లో విఫలం అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఈ వైరస్ ను చైనా ఊహాన్ లో తయారు చేసింది అంటూ పలు అగ్ర దేశాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మరియు చైనా శాస్త్రవేత్తల బృందం ప్రకటించాయి.

అయితే ఈ విషయం పై ఇంకా అధ్యయనం అవసరం అని తేల్చి చెప్పింది. చైనా కి వెళ్లిన బృందంలో 10 దేశాల నుంచి వచ్చిన ఎక్స్‌‌పర్ట్‌లు ఉన్నారు. తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, నెలల తరబడి చర్చల తర్వాతే ఈ టీం పర్యటనకు చైనా అంగీకరించింది.