Begin typing your search above and press return to search.

చైనా వ్యాక్సిన్లు తుస్.. మళ్లీ ప్రబలిన కరోనా

By:  Tupaki Desk   |   23 Jun 2021 11:30 PM GMT
చైనా వ్యాక్సిన్లు తుస్.. మళ్లీ ప్రబలిన కరోనా
X
కరోనాను పుట్టించిన చైనా దేశం.. అన్ని దేశాలకు దాన్ని పాకించింది. అందరికంటే ముందుగా ఈ విపత్తును 'క్యాష్' చేసుకుందామని చైనా 'కరోనా వ్యాక్సిన్లు' తయారు చేసింది. అయితే వాటి ప్రభావశీలత 50శాతానికి మించలేదనే ఆరోపణలున్నాయి. అయినా కూడా చైనా తమ వ్యాక్సిన్లపై తప్పుడు నివేదికలతో కొన్ని ప్రపంచ దేశాలకు అమ్మేశాయన్న ఆరోపణలున్నాయి. చైనా వ్యాక్సిన్లు కొన్న కొన్ని దేశాలు ఇప్పుడు నిండా మునిగాయి. ఆ వ్యాక్సిన్లు తీసుకున్న దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ ప్రబలడం కలకలం రేపుతోంది.

చైనా వ్యాక్సిన్లు తీసుకొని పంపిణీ చేసిన మంగోలియా, షీషెల్స్, బహ్రెయిన్ లాంటి దేశాల్లో ఇప్పుడు మళ్లీ కరోనా వైరస్ ప్రబలడం కలకలం రేపుతోంది. చైనా వ్యాక్సిన్లు వేసుకున్నా కూడా మళ్లీ వైరస్ కేసులు ఆ దేశాల్లో విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది.

వైరస్ ను సంపూర్ణంగా నియంత్రించడంలో చైనా వ్యాక్సిన్లు అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా తెలుస్తోంది. వ్యాక్సిన్లు వేసుకున్న వారికి వైరస్ సోకుతోందని.. చైనా మాల్ లాగే చైనా వ్యాక్సిన్లు విఫలమైనట్లు తాజాగా న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. చైనా టీకాలు కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లపై అస్సలు ప్రభావం చూపడం లేదని రిపోర్టులో తేలిందని పేర్కొన్నారు.

ఇప్పటికే చైనా వ్యాక్సిన్లను మంగోలియా, షీషెల్స్, బహ్రెయిన్ లాంటి దేశాల్లో 50-68 శాతం వరకు టీకాలు ఇచ్చేశారు. అమెరికా, బ్రిటన్, యూరప్ సహా వేరే దేశాల్లో సగం వేసినా వైరస్ కట్టడి అయ్యింది. కానీ ఈ దేశాల్లో కేసులు పెరిగాయి. అది చైనా వ్యాక్సిన్ల వైఫల్యం అని హాంగ్ కాంగ్ వర్సిటీ వైరాలజిస్ట్ లు తెలిపారు.

చైనా టీకాలను ఏకంగా ప్రపంచంలోని 90 దేశాలు కొని ప్రజలకు వేశాయి. చైనా మొట్టమొదట తయారు చేసిన వ్యాక్సిన్ 'సైనో ఫార్మ్'. దీని సామర్థ్యం 78.1 శాతం అని చైనా ప్రకటించింది. ఇక మరో వ్యాక్సిన్ సైనో వాక్ టీకాకు కేవలం 51శాతం సామర్థ్యం ఉన్నట్టు తేల్చారు. మంగోలియాలో టీకాలు వేసిన కేసులు తాజాగా భారీగా పెరిగాయి. చైనా టీకాలు తీసుకున్న షీషెల్స్, మంగోలియా , ఇండోనేషియా దేశాల్లో హెల్త్ వర్కర్లకు మళ్లీ పాజిటివ్ రావడం చర్చనీయాంశమైంది.యూఏఈ, బహ్రయిన్ దేశాల్లో టీకాలు తీసుకున్న వారికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో చైనా వ్యాక్సిన్లు ఫెయిల్ అయ్యాయన్న ప్రచారం సాగుతోంది.