Begin typing your search above and press return to search.

కరోనా టెస్ట్ ..ఇక మీ ఇంట్లో , మీ చేతులతోనే !

By:  Tupaki Desk   |   4 April 2020 7:04 AM GMT
కరోనా టెస్ట్ ..ఇక మీ ఇంట్లో , మీ చేతులతోనే !
X
కరోనావైరస్ ప్రస్తుతం దేశంలో వేగంగా విజృంభిస్తుంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో భయం పెరిగిపోతుంది. ఇకపోతే ,కొంతమందికి తాము కరోనా భారిన పడ్డామేమో అన్న భయం ఉన్నప్పటికీ ..ఆసుపత్రికి వెళ్ళడానికి వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారికోసం .. ఇప్పుడు ఒక సరికొత్త కిట్ మార్కెట్ లోకి వచ్చింది. ఇంట్లో కూర్చునే కరోనా పరీక్ష చేసుకోవచ్చు. అది కూడా మీకు మీరే పరీక్ష చేసుకుని ఫలితం తెలుసుకోవచ్చు. అందుకోసం బయోన్ అనే సంస్థ సరికొత్త స్క్రీనింగ్ టెస్ట్ కిట్‌ను తయారు చేసింది.

ఈ కిట్‌ ను ఉపయోగించడం సులభం.. అంతేకాకుండా కచ్చితమైన ఫలితాన్ని నిమిషాల్లోనే అందిస్తుంది. ఈ టెస్ట్ కిట్‌ లను ఇప్పటికే ఐసీఎంఆర్ ఆమోదించింది. నాణ్యత నిర్ధారణ పూర్తయిన తరువాత రిటైల్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. వారానికి 20,000 కిట్ల వరకు సరఫరా చేయగల సామర్థ్యం తమకుందని బయోన్ సంస్థ చెబుతోంది. అయితే డిమాండ్‌ ను బట్టి ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో కరోనా వైరస్ లక్షణాలను వెంటనే తెలుసుకునేందుకు సరైన సాధనాలు లేకపోవడం వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు అవస్థలు పడుతున్నాయి. దీంతో ఈ కిట్ ఆయా దేశాలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ కిట్ ఐజీజీ, ఐజీఎం ఆధారంగా పని చేస్తుంది. ఈ కిట్ ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే కరోనా ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఒక్కో కిట్ ధర డిమాండ్ కి తగ్గట్టు .. రూ.2000 నుంచి 3000 వరకు ఉండే అవకాశం ఉంది.