Begin typing your search above and press return to search.
రసిక దేశంలో కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 10 April 2020 3:00 AM ISTప్రపంచంలో చాలానే దేశాలు ఉన్నాయి. కానీ.. కొన్ని దేశాలకు ఉండే పేరు ప్రఖ్యాతులు భిన్నమైనవి. అలాంటి కోవలోకే వస్తుంది థాయ్ లాండ్. ఆ దేశం పేరు విన్నంతనే థాయ్ మసాజ్ లు.. దాని మాటున సాగే సెక్స్ దందా ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చట్టబద్ధంగా చూస్తే.. సెక్స్ దందాపై పరిమితులు ఉన్నా.. మసాజ్ ల మాటున సాగే వ్యవహారం ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకే.. కాస్త ఎంజాయ్ చేయాలన్నా.. సరదాగా మసాజ్ లు చేయించుకోవాలన్నా.. వెనుకా ముందు చూసుకోకుండా వాలిపోయే దేశాల జాబితాలో థాయ్ లాండ్ ఒకటి. కరోనాముందు వరకూ నిత్య కల్యాణం.. పచ్చ తోరణం మాదిరి సాగేది. ప్రపంచ దేశాల్లోని రసికులంతా ఆ దేశానికి క్యూ కట్టేవారు. ఆ దేశాన్ని ఎక్కువగా సందర్శించే దేశ పౌరుల్లో భారతీయులు ఎక్కువగా చెబుతారు. పర్యాటకులతో కిటకిటలాడే ఆ దేశానికి ప్రధాన ఆర్థిక వనరు పర్యాటకమే. అలాంటి దేశంలో కరోనా కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఏ దేశానికి ఆ దేశం విదేశీ ప్రయాణాల మీద పరిమితులు విధించటం.. లాక్ డౌన్ లోకి వెళ్లిపోవటంతో ఇప్పుడా దేశం వైపు కన్నెత్తి చూసే వారే కనిపించని పరిస్థితి. బతికుంటే బలుసాకు తినొచ్చే అనే సమయంలో మసాజ్ ల గురించి కనీసం కూడా ఆలోచించరు కదా. దీంతో.. ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది ఇప్పుడు ఖాళీగా ఉండిపోవాల్సిన పరిస్థితి. తమ దేశంలో లభ్యమయ్యే సెక్స్ సేవల గురించి థాయ్ ప్రభుత్వానికి తెలిసినా.. తెలియనట్లుగా ఉండేది. అదే సమయంలో.. మసాజ్ సెంటర్లకు.. సెక్స్ సేవలకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేక పోవటంతో.. ఆయా రంగాల్లో పని చేసే వారంతా ఇప్పుడు ఆకలి కేకలు పెడుతున్నారు.
కరోనా ముందు వరకూ కలెక్షన్ల జోరు భారీగా సాగేది. దీంతో.. చేతికి అందిన డబ్బును తమకు తోచినట్లుగా ఖర్చు చేసేవారు. గ్రామాల్లోని తమ కుటుంబాల వారికి బాగా పంపేవారు. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఎవరిళ్లలో వారు ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ రంగాల్లో పని చేసే వారికి ప్రభుత్వం రూ.11వేలు (మన రూపాయిల్లో) సాయంగా ఇస్తూ.. బతుకులు వెళ్లదీసుకోవాలని చెబుతోంది. అయితే.. మసాజ్ లు.. సెక్స్ బిజినెస్ లో ఉన్న వారికి ఈ సాయం అందటం లేదు. దీంతో.. వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందంటున్నారు. ప్రపంచ పరిస్థితులు కుదుటపడి.. విదేశీ ప్రయాణాల మీద నమ్మకం పెరిగిన తర్వాత మాత్రమే.. మసాజ్ ల మీద మనసు పోయే అవకాశం ఉంది. ఇదంతా జరగాలంటే ఇప్పట్లో సాధ్యం కాదంటున్నారు. ఈ నేపథ్యం లో.. కనుచూపు మేర వారి పరిస్థితి ఏ మాత్రం బాగున్నట్లుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.