Begin typing your search above and press return to search.

స్పెయిన్ కు కరోనా బాంబ్ లా మారిన ఫుట్ బాల్ మ్యాచ్

By:  Tupaki Desk   |   1 April 2020 6:30 PM GMT
స్పెయిన్ కు కరోనా బాంబ్ లా మారిన ఫుట్ బాల్ మ్యాచ్
X
కరోనా కోరల్లో చిక్కి స్పెయిన్ దేశం విలవిలలాడుతోంది. ఇటలీ, అమెరికా తర్వాత అత్యధికంగా మరణాలు, వ్యాధులు సోకింది స్పెయిన్ లోనే.. సోమవారం ఒక్కరోజే 812 మంది మరణించినట్లు స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా మరణాల సంఖ్య దేశంలో 7340కి చేరింది. స్పెయిన్ యువరాణి సైతం కరోనాతో చనిపోయింది.

స్పెయిన్ దేశంలో ఇప్పటివరకు 85వేల మందికి పైగా కరోనా సోకింది. కరోనా పాజిటివ్ కేసులు ఊహకందని విధంగా రోజురోజుకు పెరుగుతున్నాయి. వైద్యులు, సిబ్బంది వైద్య చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఇటలీ తర్వాత స్పెయిన్ లోనే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

స్పెయిన్ దేశంలో ఇంతటి కరోనా కేసులు, మరణాలకు ఇటలీలో జరిగిన ఓ ఫుట్ బ్యాచ్ కారణమని యూరప్ మొత్తం నిర్ధారిస్తోంది. ఫిబ్రవరి 19న ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఈ మ్యాచ్ స్పెయిన్ నుంచి 3వేల మంది అభిమానులు హాజరయ్యారు. అప్పటికే ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ మ్యాచ్ కు 40వేల మంది ఇటాలియన్లు వచ్చారు. కరోనా వారిలో చాలా మందికి ఉంది. వందలాది మందికి కరోనా సోకింది. ఆ వందలాది మంది వేలమందికి అంటించారు. స్పెయిన్ వాసులకు అంటించారు. అలా సామూహికంగా తిరగడం వల్ల ఇటలీ, స్పెయిన్ రెండు దేశాల్లో కరోనా పాకి వందలాది మరణాలు సంభవిస్తున్నాయి. వారికి వారి కుటుంబ సభ్యులకు కాలనీవాసులకు, కలిసిన వారికి సోకి ఇప్పుడు పెద్ద ఎత్తున మరణాలకు ఆ పుట్ బాల్ మ్యాచే కారణమవుతోంది.