Begin typing your search above and press return to search.

ఎన్ ఐఏ కి పాకిన క‌రోనా..ఏఎస్ ఐ కి పాజిటివ్!

By:  Tupaki Desk   |   25 April 2020 10:30 AM GMT
ఎన్ ఐఏ కి పాకిన క‌రోనా..ఏఎస్ ఐ కి పాజిటివ్!
X
క‌రోనా మహమ్మారి ఉధృతికి మ‌హారాష్ట్ర ఇప్పుడు చిగురుటాకుల వ‌ణికిపోతోంది. దేశంలోనే అత్య‌ధిక కరోనా పాజిటివ్ కేసుల‌తో మహారాష్ట్ర అగ్ర స్థానంలో ఉంది. మురికివాడ‌ల నుంచి వీఐపీలు - సెల‌బ్రిటీల నివాసాల వ‌ర‌కు కోవిడ్ వైర‌స్ వేగంగా విస్త‌రిస్తూ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రాజ‌ధాని ముంబ‌య్ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న క‌రోనా ఇప్పుడు ఎన్ ఐఏ కు కూడా పాకింది.

కరోనా మహమ్మారి ఇప్పటివరకు వైద్యులకి - పోలీసులకి - పరిశుద్ధ కార్మికులకు పాకిన వైర‌స్ ..ఇపుడు ఎన్ ఐ ఏ ను తాకింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అసిస్టెంట్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ముంబై ఎన్ ఐ ఏ ఆఫీసులో స‌ద‌రు వ్య‌క్తి ఏఎస్ ఐగా గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. దీనితో ఆ సంస్థ అధికారులు అప్రమత్తమమై ఎన్ ఐ ఏ కార్యాలయం లో పని చేస్తున్న ఉద్యోగులను సెల్ఫ్ క్వారంటైన్ చేశారు.

దీనితో ఇప్పుడు, పాజిటివ్ గా వ‌చ్చిన ఏఎస్ ఐ తో స‌న్నిహితంగా మెలిగారా అనే విష‌యంపై ఆరా తీస్తున్నారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యం లో ముందు జాగ్ర‌త్త‌గా ఆఫీస‌ర్లంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి..అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్ లో ఉంచ‌నున్న‌ట్లు ఎన్ ఐ ఏ అధికార ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 394 కరోనా కేసులు బయటపడ్డాయి. 11 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,817కు పెరిగింది.