Begin typing your search above and press return to search.

బెంగుళూరులో ఒకడి నుండి 50 మందికి కరోనా..!

By:  Tupaki Desk   |   15 April 2020 10:30 AM GMT
బెంగుళూరులో ఒకడి నుండి 50 మందికి కరోనా..!
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో ప్రతి ఒక్కరు కూడా భయంతో వణికిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధితో 1, 26,830 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటి వరకు 2,004,819మంది కరోనా వైరస్ వ్యాధి సోకింది. భారతదేశంలో 11,555 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో భాదపడుతున్న 1, 306 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ చికిత్స విఫలమై భారత్ లో ఇప్పటి వరకు 396 మంది మరణించారు.

ఇకపోతే , ఈ కరోనా వైరస్ సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు కర్ణాటక లో 260 కరోనా కేసులు నమోదు కాగా .. వారిలో 10 మంది చనిపోయారు. 71 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 28 రోజుల్లో బెంగళూరు నగరంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని అధికారులు అంటున్నారు. అయితే అప్పటికే కరోనా వైరస్ వ్యాధి సోకిన ఒకవ్యక్తి వలన 50 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని, ఆ వ్యక్తులు సంచరించిన వార్డులు ఇప్పుడు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు.

బెంగళూరు నగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా .. బెంగళూరులోని 38 వార్డులు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు గుర్తించి, అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు బీబీఎంపీ కమిషనర్ బిహెచ్ అనీల్ కుమార్ తెలిపారు. ఆలా హాట్ స్పాట్ .. ప్రాంతాలలో ప్రజలకు నిత్యవసర వస్తువులు - కూరగాయలు - పాలు తదితర నిత్యవసర వస్తువులను బీబీఎంపీ అధికారులు వాళ్ల ఇళ్ల దగ్గరకే వెళ్లి అందిస్తున్నారు. కరోనాను అరికట్టడంలో భాగంగా బీబీఎంపీ వార్డు నెంబర్ 134 బాపూజీనగర్, వార్డు నెంబర్ 135 పాదరాయణపుర ప్రాంతాలు నాలుగు రోజుల క్రితమే పూర్తిగా సీల్ డౌన్ చేసారు. బెంగళూరు నగరంలో మిగిలిన వార్డులు సంపూర్ణంగా సీల్ డౌన్ చేస్తారని ప్రజల్లో ఆందోళన మొదలైయ్యింది.