Begin typing your search above and press return to search.

హనీమూన్ కి ఇటలీ వెళ్తే కొంపముంచిన కరోనా..?

By:  Tupaki Desk   |   14 March 2020 12:15 PM IST
హనీమూన్ కి ఇటలీ వెళ్తే కొంపముంచిన కరోనా..?
X
కరోనా వైరస్ ..ఎవరిని వదిలిపెట్టడం లేదు. ప్రపంచంలోని దాదాపుగా 130 దేశాలకి పాకిన ఈ వైరస్ పేరు చెప్తేనే ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా బెంగుళూరులో గూగుల్ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అదే సమయంలో క్యాంపస్ లోని ఉద్యోగులందరినీ వర్క్ టు హోం కు ఆదేశించారు. అయితే, గూగుల్ ఉద్యోగిపై దృష్టి పెట్టిన వైద్యాధికారులు వారు ఇటలీ వెళ్లి వచ్చిన విషయాన్ని గుర్తించారు.

అయితే , భర్త కి కరోనా సోకింది అని తెలియగానే అతని భార్య ఆగ్రాలో ఉన్న పుట్టింటికి పారిపోయింది. ఈమె బెంగళూరు నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి ఆగ్రాకు చేరుకుంది. దీంతో భర్తతోపాటు భార్యకు వైరస్ సోకే అవకాశం ఉందని బెంగళూరు వైద్యులు ఆగ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని వైద్యుల బృందం టెకీ భార్య పుట్టింటికి వచ్చారు. వారు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించడంతో దీంతో జిల్లా కలెక్టరు - పోలీసుల జోక్యంతో టెకీ భార్య పరీక్షకు అంగీకరించింది.

వైద్యాధికారులు జరిపిన పరీక్షలో బెంగళూరు గూగుల్ ఉద్యోగి భార్యకు కూడా కరోనా వైరస్ సోకిందని తేలడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గూగుల్ ఉద్యోగి భార్య కుటుంబసభ్యులు 9 మందిని కూడా ఆగ్రాలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి, వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచి వైద్యపరీక్షలు చేస్తున్నామని ఆగ్రా వైద్యులు చెప్పారు. హనీమూన్ కోసం ఇటలీ దేశానికి వెళ్లి వచ్చిన దంపతులకు కరోనా వైరస్ సోకిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో కలకలం సృష్టించింది.