Begin typing your search above and press return to search.

సేమ్ టు సేమ్.. మరోసారి సింగిల్ కేసుతో మొదలైందిగా?

By:  Tupaki Desk   |   29 Dec 2020 8:11 AM GMT
సేమ్ టు సేమ్.. మరోసారి సింగిల్ కేసుతో మొదలైందిగా?
X
నిన్నమొన్నటి అనుమానం ఇప్పుడు నిజమైంది. అక్కడెక్కడో యూకేలో ఉందనుకున్న కొత్త వైరస్.. దేశానికి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోకి చొచ్చుకొచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిలో కొత్త వైరస్ లక్షణాల్ని గుర్తించటం తెలిసిందే. ఇదంతా చూసినప్పుడు కరోనా మొదటి కేసు గుర్తుకు రాక మానదు. విదేశాల నుంచి వచ్చిన సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ గా తేలటంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అలా సింగిల్ కేసుతో మొదలైన కరోనా.. తర్వాతి రోజుల్లో వేలాది కేసులుగా మారటం తెలిసిందే.

గతాన్ని గుర్తు చేసేలా యూకే కొత్త స్ట్రెయిన్ తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిలో కన్ఫర్మ్ కావటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. అప్పుడు సింగిల్ కేసుతో కరోనా షురూ అయితే.. ఇప్పుడు సింగిల్ కేసుతో కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చినట్లైంది. అంతేకాదు.. కరోనా తొలి కేసులు వరుస పెట్టి తెలంగాణలోనే నమోదయ్యాయి. తర్వాతి కాలంలో ఏపీలో కేసులు వెల్లడయ్యాయి.

తాజా యూకే స్ట్రెయిన్ తెలంగాణలోనే కానీ.. ఏపీలో నమోదు కాలేదు. కరోనాతో పోలిస్తే.. కొత్త స్ట్రెయిన్ 60 శాతం ఎక్కువ వేగంతో విస్తరించే వీలుంది. ఈ నేపథ్యంలో కరోనాతో పోలిస్తే.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న మాట వినిపిస్తోంది. గతాన్ని గుణపాఠంగా గుర్తు చేసుకుంటూ అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.