Begin typing your search above and press return to search.
కరోనా భూతం పై యుద్దానికి సిద్దమైన భారత్ !
By: Tupaki Desk | 19 March 2020 2:40 PM ISTయుద్ధం అనగానే ఇదేదో ఇండో -పాక్ యుద్ధం అనుకోకండి. కరోనా పై యుద్ధం. దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ పై అవగాహన పెరుగుతోంది. కరోనా వైరస్ పై ప్రజలకే కాదు ప్రభుత్వ యంత్రాంగానికి సైతం ఒక స్పష్టత వస్తోంది. దీనితో కరోనా ని అరికట్టడంలో భాగంగా కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ యుద్ధంలో ప్రభుత్వం యంత్రాంగం ఎంత మేర పనిచేస్తుంది అన్నదానికంటే ..ప్రజలు ఏమేర ఈ యుద్దానికి మద్దతుగా నిలుస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కాకపోతే కరోనా పై ఇప్పుడు అందరికి ఒక అవగాహనా రావడంతో ప్రభుత్వానికి , ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుంది అని చెప్పవచ్చు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో కరోనా పై ఈ యుద్ధం ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ..
ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 8 వేల మందిని పొట్టనపెట్టుకుంది. మరో రెండు లక్షల మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మన దేశం సేఫ్ అని చెప్పినా కూడా , కరోనా మన దేశం పై విరుచుకుపడటానికి సిద్ధంగా ఉంది. ఆ ముప్పును తప్పించే శక్తి ఒక్క ప్రజలకు మాత్రమే ఉంది. అసలు కరోనా ముప్పుని ప్రజలు ఎలా తప్పించగలుగుతారు అంటే ... సోషల్ డిస్టెన్స్ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు అడ్డుకోవచ్చు. అసలు ఈ సోషల్ డిస్టెన్స్ అంటే ఏమిటి అని అనుకుంటున్నారా? ప్రతీ ఒక్కరూ బహిరంగ స్థలాలకు, సామాజిక కార్యకలాపాలకు, ఇతరులకు దూరంగా ఉండడమే సోషల్ డిస్టెన్స్. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో దాని ఉపద్రవాన్ని తగ్గించడంలో కీలకం సోషల్ డిస్టెన్స్.
ఇలా చేసి , కొత్తగా ఎవరు వైరస్ భారిన పడకుండా చేసుకోగలిగితే ...దాన్ని అరికట్టడం సులభమే. కొత్తగా వ్యాధిబారిన పడేవారు తగ్గిపోతే ప్రభుత్వంపై, ప్రజల పై, ఆసుపత్రుల పై కూడా ఒత్తిడి తగ్గి పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాన్ని పాటించాలి..ఈ యుద్ధంలో పాల్గొనాలి. ఇక , కరోనా వైరస్ తదుపరి స్పాట్ భారత్ అంటూ ఇప్పటికే అమెరికన్ నిపుణులు కొందరు ఇండియాని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో కరోనాని అడ్డుకోవాలి అంటే ఈ సోషల్ డిస్టెన్స్ తోనే సాధ్యం. సోషల్ డిస్టెన్స్ ను అమలు చేయడం అంత సులభమేం కాదు. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందే. ప్రభుత్వమే దాన్ని అమలు చేయాలంటే మాత్రం పలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా అయినా ఆ కఠిన చర్యలను తీసుకోవడం లో ముందుకెళ్తూనే ఉంది. మరో వైపున వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం కఠిన చర్యల అమలుకు శ్రీకారం చుట్టాయి.
దేశంలో ఇప్పటికే డజనుకు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ , ప్రముఖ ఆలయాలని ... మూసివేశాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలలో జరిగే బోర్డు పరీక్షలని కూడా కొన్ని రోజుల వరకు వాయిదా వేశారు. అలాగే కొన్ని కంపెనీ లు తమ ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోమ్ ని ఆఫర్ చేసాయి. ప్రజలు ప్రజలు అనవసర ప్రయాణాలను మానుకోకుంటూ ప్రజారవాణా వ్యవస్థను నిలిపి వేస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరించారు. కేంద్రం 14 రోజుల క్వారంటైన్ ను మాత్రమే సూచించినా కేరళ లో మాత్రం ముందు జాగ్రత్తగా 28 రోజుల క్వారంటైన్ ను అమలు చేస్తున్నారు. దీనికి కారణం కేరళ వాసులు ఎక్కువగా విదేశాల నుండి రాకపోకలు సాగిస్తుంటారు. మొదటగా వైరస్ కు సంబంధించి అప్రమత్తమైంది కూడా కేరళనే.
అయితే , కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పలువురి ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి. కానీ, ఆ చర్యలు తప్పనిసరి కావడం తో ప్రభుత్వం కూడా ఏమిచేయలేకపోతుంది. కరోనా వైరస్ పై అవగాహన పెంచడం ఎంత ముఖ్యమో, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నాయి. ప్రజల్లో ఈ అవగాహన పెంచేందుకు సినీతారలు, సెలెబ్రిటీలు ముందుకొచ్చారు. న్యాయస్థానాలు వీడియో కాన్ఫరెన్స్ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. మొత్తంగా కరోనా వైరస్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ సోకిన తరువాత చికిత్స కన్నా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడమే మంచిది కదా. వైరస్ భారిన పడి ...కోలుకున్నవారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కరోనా అనగానే భయపడకుండా కొన్ని రోజులపాటు సోషల్ డిస్టెన్స్ ని పాటిస్తే కరోనాని అరికట్టడానికి అవకాశం ఉంది. ఆ దిశగా దేశ ప్రజానీకం అడుగులు వేయాలని కోరుకుందాం ...!