Begin typing your search above and press return to search.
28 వేల నర్సులకి కరోనా
By: Tupaki Desk | 14 May 2020 10:30 AM ISTఅమెరికాలో కరోనా మహమ్మారి తీవ్రత ఎంతకు తగ్గడం లేదు. లాక్ డౌన్ పై నిరసనలు వెల్లువెత్తడం.. అధ్యక్షుడు ట్రంప్ కూడా లాక్ డౌన్ వద్దంటూ పిలుపునివ్వడంతో ఆయా రాష్ట్రాలు ఎత్తేస్తున్నాయి. దీంతో కరోనా మరింతగా వ్యాపిస్తోంది. సాధారణ ప్రజలకే కాదు..కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి సైతం కరోనా సోకుతుండడం కలవరపెడుతోంది. దీంతో అమెరికాలో వైద్య సిబ్బంది కొరత వెంటాడుతోంది.
కరోనా రోగులకు అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో ఒక్కరోజులోనే 200 మంది నర్సులకు కరోనా సోకినట్టు నర్సింగ్ అసోసియేషన్ డైరెక్టర్ గెరార్డ్ బోర్డాన్ వెల్లడించారు.
ఇక అమెరికా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 28వేల మంది నర్సులు కరోనా బారినపడ్డారు. వారిలో 230 మందికి పైగా చనిపోయినట్టు తెలిపారు.
అమెరికాలో వైద్యులు, సిబ్బంది కొరత కరోనా కారణంగా తీవ్రమవుతోంది. చాలా మందికి కరోనా సోకి వారు చికిత్స తీసుకుంటుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. అందుకే ఇటీవల ఈ పరిస్థితిని గమనించిన అమెరికా కాంగ్రెస్ గ్రీన్ కార్డుల బిల్లును ప్రవేశపెట్టింది. అమెరికాలో స్థిరపడడానికి ఈ బిల్లు ద్వారా అవకాశం కల్పించింది. అయితే ఈ గ్రీన్ కార్డులు అందరికీ అమెరికా ఇవ్వడం లేదు. కేవలం విదేశీ డాక్టర్లు, నర్సులకు మాత్రమే ఈ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్ కార్డులను తక్షణం జారీ చేయాలని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ గ్రీన్ కార్డులను మంజూరు చేయడం ద్వారా అమెరికన్ పౌరులకు వైద్యసహాయం అందించడంతో పాటు విదేశీయులు అక్కడ శాశ్వత నివాసం ఉండవచ్చు.
ఈ బిల్లు ద్వారా అత్యధికంగా భారతీయులకే ప్రయోజనం కలుగనుంది. ఈ బిల్లు ఆమోదిస్తే 25000 మంది నర్సులు, 15000 మంది విదేశీ డాక్టర్లకు గ్రీన్ కార్డులు లభిస్తాయి. అక్కడే ఉంటున్న హెచ్1బీ, జే2 వీసాలపై ఉండి గడువు ముగుస్తున్న భారతీయ డాక్టర్లు, నర్సులకు ఇది ఎంతో ప్రయోజనంగా మారింది.