Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌.. ఏపీలో12కు చేరిన కరోనా కేసులు

By:  Tupaki Desk   |   27 March 2020 7:50 AM GMT
బ్రేకింగ్‌.. ఏపీలో12కు చేరిన కరోనా కేసులు
X
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మొదటి దశలో ఉన్న కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం రెండో దశకు చేరుకుంది. ఒకరి ద్వారా మరొకరికి ఆ వైరస్‌ సంక్రమిస్తే రెండో దశగా పేర్కొంటారు. ప్రస్తుతం ఒకరి ద్వారా మరొకరి ఏపీలో కరోనా వైరస్‌ వ్యాపించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలోని విశాఖపట్టణంలో మరొక పాజిటివ్‌ కేసు గుర్తించారు. విదేశాల నుంచి విశాఖపట్టణానికి వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పీ 7 పేషెంట్‌ నుంచి కుటుంబ సభ్యుడికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు ధ్రువీకరించారు. ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 12కు చేరాయి. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
విశాఖపట్టణంలో నాలుగు కేసులు నమోదు కాగా, విజయవాడ లో మూడు, తూర్పు గోదావరి, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.

అయితే విజయవాడ కు చెందిన 28 ఏళ్ల యువకుడు స్వీడన్‌ నుంచి రావడంతో అతడికి కరోనా సోకింది. ఈ నెల 18న స్వీడన్‌ నుంచి ఢిల్లీ చేరుకుని అదే రోజు మధ్యాహ్నం ఢిల్లీ మీదుగా విజయవాడ కు వచ్చాడు. బెజవాడ విమానాశ్రయం నుంచి క్యాబ్‌లో ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి అతడు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అతడిని పర్యవేక్షిస్తున్న వైద్యులు ఆ క్రమంలో ఈ నెల 24వ తేదీన వైరస్‌ లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే యువకుడి శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపించగా కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసులు ఏపీలో 12కు చేరాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా దేశవిదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో మరి కొందర్ని ఐసోలేషన్‌ వార్డుల్లో అధికారులు ఉంచారు. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.