Begin typing your search above and press return to search.

ఏపీకి కరోనా పాకింది.. తొలి పాజిటివ్ కేసు నమోదు

By:  Tupaki Desk   |   11 March 2020 7:58 AM GMT
ఏపీకి కరోనా పాకింది.. తొలి పాజిటివ్ కేసు నమోదు
X
ఇటీవల తెలంగాణలో కరోనా కేసు నమోదు కాగా అక్కడి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కానీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇన్నాళ్లు కరోనాకు దూరంగా ఉన్న ఆంధప్రదేశ్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా కరోనా వైరస్ తొలి పాజిటివ్ కేసు ఆంధ్రప్రదేశ్ లో నమోదైంది. కరోనా వైరస్ లక్షణాలతో మంగళవారం నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రిలో ఓ యువకుడు చేరాడు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి రిపోర్ట్స్ కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు వైద్యాధికారులు.

నెల్లూరులోని చిన్న బజారుకు చెందిన ఆ యువకుడు ఇటీవల ఇటలీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చాడు. నెల్లూరుకు వచ్చిన ఆయన జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతుండటంతో మంగళవారం ఆస్పత్రి లో చేరగా వైద్య పరీక్షలు నిర్వహించగా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆస్పత్రి వర్గాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. కరోనా భాదితుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డు లో ఆ యువకుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండో విడత పరీక్షల కోసం అతడి రిపోర్ట్స్ పుణెకు పంపారు. తొలి పాజిటివ్ కేసు నమోదు కావడం తో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా కేసు నమోదవడం తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటలీ నుంచి పలు దఫాల్లో 75 మంది ఏపీకి రాగా వచ్చిన వారంతా ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. 14 రోజుల పాటు ఇంట్లో ఏకాంతంగా, ఐసోలేటెడ్ గదిలో ఉండాలని తెలిపింది.