Begin typing your search above and press return to search.

తెలంగాణలో 20కు చేరిన కరోనా బాధితులు? తాజాగా ఎవరంటే?

By:  Tupaki Desk   |   21 March 2020 12:11 PM GMT
తెలంగాణలో 20కు చేరిన కరోనా బాధితులు? తాజాగా ఎవరంటే?
X
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతోంది. ఈ నెల మొదటి నుంచి చూస్తే.. ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదు కావటం.. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా వెలుగు చూడటం జరిగినా.. ఇండోనేషియాకు చెందిన తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ తేలిన తర్వాత నుంచి బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నెల మొదటి తేదీ నుంచి ఇప్పటివరకూ విదేశాల నుంచి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన వారు భారీగా ఉండటం.. తమ ప్రయాణాల గురించి అధికారులకు తెలియజేయకపోవటం.. ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ విధానాన్ని పాటించకపోవటం లాంటి కారణాలతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇరవైయ్యో పాజిటివ్ కేసు మహిళగా చెబుతున్నారు. కేపీహెచ్ బీ పరిధిలో వారి నివాసమన్న మాట వినిపిస్తోంది.ఈ కేసుకు సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..బాధితురాలి సోదరుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. ఆమె సోదరుడికి ఇప్పటికే పాజిటివ్ గా నమోదైందా? లేదా? అన్న విషయాల మీద క్లారిటీ రావటం లేదు.

విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ క్వారంటైన్ చేసుకోవటంతో పాటు.. జాగ్రత్తలు పాటించకుంటే హైదరాబాద్ మహానగరానికి ముప్పు తప్పదంటున్నారు. ఇప్పటికైనా సరే.. ఎవరికి వారు స్పందించి.. జాగ్రత్తలు తీసుకుంటే తప్పించి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది తప్పించి తగ్గదంటున్నారు. సో.. బీకేర్ ఫుల్..