Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్లు ఇక ట్యాబ్లెట్ల రూపంలో..!

By:  Tupaki Desk   |   24 March 2021 1:30 AM GMT
కరోనా వ్యాక్సిన్లు ఇక ట్యాబ్లెట్ల రూపంలో..!
X
కరోనా వ్యాక్సినేషన్​ మనదేశంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. రికార్డు స్థాయిలో రెండో దశలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్లు ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో ఉన్నాయి. అయితే ఇవి ఇంజెక్షన్లు తీసుకోవాలంటే కొంతమంది భయపడుతుంటారు. నొప్పి భరించలేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ల కోసం ట్యాబ్లెట్లను తయారుచేయబోతున్నది ఓ కంపెనీ. నిజానికి గతంలోనూ పలు వ్యాధులకు వ్యాక్సిన్లు అంటే ఇంజెక్షన్ల రూపంలోనే ఉంటాయి. కానీ ప్రస్తుతం ట్యాబెట్లు ( మందు బిల్లల) రూపంలో వ్యాక్సిన్ తీసుకొస్తామంటూ ఓ కంపెనీ చెబుతున్నది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి.ఇండియాకు చెందిన ప్రేమాస్ బయోటెక్ కూడా కరోనా వ్యాక్సిన్​ టాబ్లెట్ రూపంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది.
అమెరికాకు చెందిన ఒరామ్‌ డ్ అనే ఫార్మాసూటికల్స్ కంపెనీ తాము నోటితో తీసుకొనే కోవిడ్​ వ్యాక్సిన్​ ను తయారుచేస్తున్నట్లు మార్చి 19న ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఈ పద్ధతిలో కేవలం ఒక్క డోస్​ తీసుకుంటే సరిపోతుంది.

రోగ నిరోధకశక్తి పెంపొందించడంలో, యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో, న్యూట్రలైజ్ చేయడంలో ఈ ట్యాబ్లెట్లు బాగా పనిచేస్తాయని గ్యాస్ట్రోఇంటెస్టినల్, శ్వాస వ్యవస్థలకు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రొటీన్ ఆధారిత ఈ వ్యాక్సిన్ SAARS CoV2 వైరస్ మూడు భాగాలపై ప్రొటెక్షన్ ఇస్తుంది. స్పైక్ ఎస్, మెంబ్రేన్ ఎమ్, ఎన్వలప్ ఈ లను టార్గెట్ చేసి కాపాడుతుంది.న్యూక్లియోక్యాప్సిడ్ ఎన్ యాంటీజెన్ కు ప్రొటెక్షన్ ఇవ్వలేదు.అయితే దీనిపై ఇంకా ప్రయోగాలు మాత్రమే జరుగుతున్నాయి. ప్రస్తుతం జంతువుల మీదే వీటిని ప్రయోగిస్తున్నారు. త్వరలోనే క్లినికల్​ ట్రయల్స్​ ముగించి ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తర్వాత ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి.