Begin typing your search above and press return to search.

బ్లాక్ మార్కెట్లో కరోనా వ్యాక్సిన్

By:  Tupaki Desk   |   12 Jan 2021 4:00 PM IST
బ్లాక్ మార్కెట్లో కరోనా వ్యాక్సిన్
X
దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వాటిని కొని ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు ఇవ్వడానికి రెడీ అయ్యింది. జనవరి 16 నుంచి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు.

ఇక ఆ తర్వాత 50 ఏళ్ల పైబడిన వృద్ధులు, దీర్ఘాకాలిక రోగులకు ఇవ్వడానికి కేంద్రం పూనుకుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ కరోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్లోకి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కొందరు నయా దందా మొదలుపెట్టినట్లు తెలిసింది.

దేశంలో కరోనా వ్యాక్సిన్ సరఫరా కూడా ఇంకా పూర్తవలేదు.కానీ బ్లాక్ మార్కెట్లో ఇది అందుబాటులోకి వచ్చేసిందని సమాచారం.

కర్ణాటకలోని ధనవంతులకు తమ వద్ద వ్యాక్సిన్ ఉందని.. కావాలంటే బిట్ కాయిన్ రూపంలో డబ్బు చెల్లించాలని కొందరు మెసేజ్ లు పంపుతున్నారట.. ఈ విషయాన్ని ప్రైవేట్ ఆస్పత్రులసంఘం ధ్రువీకరించింది.

బ్లాక్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ వ్యాక్సిన్ ఏమిటో తెలియదని.. ఈ విషయంలో ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించాలని సూచించింది.