Begin typing your search above and press return to search.

వచ్చే వారంలోనే కరోనా టీకా ?

By:  Tupaki Desk   |   27 Oct 2020 10:00 AM IST
వచ్చే వారంలోనే కరోనా టీకా ?
X
నవంబర్ 2వ తేదీనుండి కరోనా వైరస్ కు టీకా రాబోతోందా ? అవుననే చెబుతోంది బ్రిటన్ కు చెందిన ప్రముఖ మీడియా ది సన్. బ్రిటన్ లోని ఆక్సవర్డ్+ప్రముఖ మందుల తయారీ సంస్ధ ఆస్త్రాజెనికా సంయుక్తంగా చేస్తున్న కృషి ఫలితంగానే కరోనా వైరస్ కు విరుగుడు టీకా తయారైనట్లు సమాచారం. బ్రిటన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ సర్వీసులోని వైద్య ఆరోగ్య సిబ్బందికి నవంబర్ 2వ తేదీన టీక మందును ప్రయోగాత్మకంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యిందని మీడియ చెప్పింది.

ఆస్త్రాజెనికా ఆధ్వర్యంలో తొలిదశ ప్రయోగాల క్రింద టీకా అందుకోవటానికి ఆసుపత్రి సిబ్బంది రెడీగా ఉండాలని ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ కూడా అందిందట. ఎప్పుడైతే ఆస్త్రాజెనికా నుండి లేఖ అందిందో అప్పటి నుండో కరోనా వైరస్ కు సంబంధించిన అన్నీ రకాల వైద్యాన్ని ఆసుపత్రి వర్గాలు నిలిపేశాయట. ఇదే సందర్భంలో వచ్చే ఏడాది మొదటి ఆరునెలల్లోనే కరోనా వైరస్ కు విరుగుడు టీకాను పంపిణీ చేయటానికి బ్రిటన్ ప్రభుత్వం రెడీ అవుతోందని ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాన్ కాక్ చేసిన ప్రయోగం ఆసక్తిగా మారింది.

ఇదే సందర్భంగా తాము డెవలప్ చేసిన టీకా మందు యువకులు, వృద్ధుల్లో బాగా పనిచేస్తున్నట్లు తమ క్లినికల్ ట్రయల్స్ లో నిర్ధారణ అయినట్లు ఆస్త్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో బ్రిటన్ లోని నేషనల్ హెల్త్ సర్వీసులోని సిబ్బందికి టీకా వేయటం ఖాయమని అనుకుంటున్నారు. టీకా మందు తయారు చేయటంలో ప్రపంచంలోని అనేక దేశాలు క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్ దేశాల్లో మాత్రమే ప్రయోగదశను దాటి క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి.

చైనా, రష్యాలలో రోగులకు ఇస్తున్న మందులపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి టీకా మందు పెద్దగా ఉపయోగం కనబడటం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా భారత్ తో కలిపి మరో 100 దేశాల్లో టీకా తయారీకి చాలా స్పీడుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అందుకనే ఏ దేశంలో టీకా తయారైపోతోందని ప్రకటన వచ్చినా వెంటనే యావత్ ప్రపంచం ఆ దేశం వైపు చూస్తున్నాయంటేనే కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఎంతలా వణికించేస్తోందో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఆస్త్రాజెనికా తీసుకొస్తున్న టీకా సమర్ధవంతంగా పనిచేయాలని ఆశించాలి.