Begin typing your search above and press return to search.

తయారైన కరోనా వ్యాక్సిన్ ... ట్రయిల్ ఇంజెక్షన్ ఎవరికంటే ?

By:  Tupaki Desk   |   19 March 2020 4:30 AM GMT
తయారైన కరోనా వ్యాక్సిన్ ... ట్రయిల్ ఇంజెక్షన్ ఎవరికంటే ?
X
కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న మహమ్మారి. చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ ...రోజురోజుకి వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచం మొత్తం పాకుతోంది. చైనాలో ఈ వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ ...ఇటలీని వణికిస్తుంది. దేశాలకు దేశాలే చిగురుటాకులా వణుకుతున్నాయి. భారత్ లో కూడా ఈ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇకపోతే , సైన్స్ పరంగా ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ..కరోనా వైరస్ బయటపడి నెలలు గడుస్తున్నా కూడా కరోనా కి మందు కనిపెట్టలేకపోవడం గమనార్హం.

ప్రస్తుతానికి కరోనా సోకకుండా నివారణకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నప్పటి, ఈ ముందు జాగ్రత్త చర్యల వల్ల కరోనాని పూర్తిగా అడ్డుకోవడం అసాధ్యం అని అందరికి తెలుసు. దీని తో లోలోపల భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది. దీనితో ప్రపంచాన్ని భయం తో వణికిస్తున్న కరోనాని కంట్రోల్ కోసం మందు కోసం దేశాలు పోటాపోటీగా వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా ముందడుగు వేసింది. కరోనా వైరస్ కి వాక్సిన్ ని తయారు చేసి తొలి ట్రయల్‌ గా ఓ మహిళపై ప్రయోగించింది.

సియాటిల్‌ కు చెందిన 43 ఏళ్ళ మహిళ హాల్లెర్‌ పై వాక్సిన్‌ ను తొలిసారి ప్రయోగించామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అదే ఇప్పటికే మహిళకు రెండో ఇంజెక్షన్‌ కూడా ఇచ్చామని స్పష్టం చేసింది. మార్చి 16వ తేదీన కరోనా వాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించామని, సియాటిల్‌ లోని కైజర్ పెర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ లో ఈ ప్రయోగం జరిగిందని అమెరికా వెల్లడించింది. ఎంఆర్ ఎన్ ఏ -1273 (mRNA-1273) పేరుతో రూపొందించిన కరోనా వైరస్ వాక్సిన్ ఈ భయంకర వైరస్‌ ను పూర్తిగా నిర్మూలిస్తుందని ప్రస్తుతం ప్రయోగశాలలో ప్రతీ ఒక్కరు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ వాక్సిన్ ప్రాథమిక దశలో విజయవంతమైతే, తరువాతి దశలో అమెరికా, చైనా, దక్షిణ కొరియాలలో ప్రయోగించి చూస్తామని లాబొరేటరీ నిర్వాహకులు తెలిపారు. ఇక కరోనా వైరస్ వాక్సిన్‌ ను తొలిసారి తీసుకున్న జెన్నీఫర్ హాల్లెర్ కరోనా పై ప్రపంచం ఏమీ చేయలేక, నిరాశలో కూరుకుపోయిన సందర్భంలో తనకు ఈ అవకాశం దక్కడం ఆనందంగా వుందని తెలిపింది.