Begin typing your search above and press return to search.

ఇంట్లో పెంపుడు జంతువులకు కరోనా వ్యాక్సిన్ తప్పని సరి!

By:  Tupaki Desk   |   26 Jan 2021 4:00 PM IST
ఇంట్లో పెంపుడు జంతువులకు కరోనా వ్యాక్సిన్ తప్పని సరి!
X
చాలా దేశాల్లో కరోనా తీవ్రత తగ్గినప్పటికీ కరోనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి. అమెరికా వంటి అగ్ర దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అన్ని దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ లు వేయడం మొదలు పెట్టారు. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకాలు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇళ్లలో పెంచుకునే పెంపుడు జంతువులకు కరోనా టీకా వేయించాలా.. వద్దా.. అని చాలా మంది ఆలోచిస్తున్నారు.

అయితే ఇళ్లలోని పిల్లులు, కుక్కలకు వ్యాక్సిన్ వేయించడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జంతువులకు ఎలాగూ కరోనా రాదు కదా..అని వదిలేయద్దు..అని ఇన్పెక్షన్ ను అడ్డుకోవడానికి వ్యాక్సిన్ వేయించాలని జర్నల్ లో నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు పిల్లులు, కుక్కల వల్ల కరోనా సోకిన దాఖలాలు లేవు.కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా దీర్ఘ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెంపుడు జంతువులకు టీకా వేసుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లోని పెంపుడు జంతువులతో చాలా మంది అతి దగ్గరగా ఉంటారు. వాటితో మమేకమై ఆటలాడుతుంటారు. బైట తిరిగే మన వల్ల వాటికి వైరస్ వచ్చే అవకాశం ఉంది. వాటికి కరోనా సోకితే వాటి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా వైరస్ ని సమూలంగా నాశనం చేయాలంటే పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ తప్పని సరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.