Begin typing your search above and press return to search.
వస్తుందో రాని కరోనా టీకాతో గాలం... వివాదాస్పదం
By: Tupaki Desk | 23 Oct 2020 11:45 AM ISTఎన్నికల ముంగిట కరోనా వైరస్ టీకా ఉచితం పేరుతో బీజేపీ గాలం వేస్తోంది. కరోనా వైరస్ టీకా అందుబాటులోకి రాగానే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తామని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. ఎన్నికల ప్రణాళిక పేరుతో కేంద్రమంత్రి విడుదల చేసిన హామీల్లో కరోనా వైరస్ ను ఉచితంగా అందిస్తామనే హామీ కూడా ఉంది. ఈ హామీనే ఇపుడు బీహార్లో సంచలనంగా మారింది. బీజేపీ చేసింది తప్పుడు ప్రకటనే అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించటమే లక్ష్యంగా బీజేపీ అనైతిక ప్రకటనలు చేస్తోందంటూ ఆర్జీడే చీఫ్ తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం దేశమంతా ఉన్నపుడు ఒక్క బీహార్ ప్రజలకు మాత్రమే ఉచితంగా అందిస్తామని కేంద్రమంత్రి ప్రకటించటంలో అర్ధమేంటి ? అంటూ విపక్షాలు నిలదీస్తున్నాయి. సరే ఈ ప్రశ్నకు బీజేపీ నుండి సమాధానం రావటం లేదు లేండి. కరోనా వైరస్ విషయంలో మూడు కంపెనీలు తయారు చేస్తున్న టీకా మందు ప్రయోగదశలో స్పీడందుకున్నట్లు మంత్రి చెప్పారు. టీకా మందు తయారుకాగానే వాటిని బీహార్ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలన్నది తమ హామీగా మంత్రి హామీ చెప్పటమే విచిత్రంగా ఉంది.
ఇదే విషయమై బీహార్ ఎన్నికల్లో లబ్దికి బీజేపీ కరోనా వైరస్ టీకా పేరుతో ఆటలాడుతోందంటూ ప్రతిపక్షాలన్నీ మండిపోతున్నాయి. ప్రజలను ఆకర్షించటానికి కేంద్రమంత్రి చేసిన ప్రకటన కారణంగా బీజేపీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశాయి. కరోనా వైరస్ సమస్యను కేంద్రం తనకు అనుకూలంగా వాడుకోవాలని చూడటాన్ని నీచమైన రాజకీయంగా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కరోనా వైరస్ కు టీకా అన్నది యావత్ దేశప్రజలకు సంబంధించినదే కానీ కేవలం బీజేపీకి మాత్రమే సంబంధించినది కాదని కాంగ్రెస్ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి ప్రతిపక్షాల దాడిని బీజేపీ ముందుగానే ఊహించిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే బీహార్ లోని ప్రతిపక్షాలు ఎంత గొంతుచించుకుంటున్నా బీజేపీ నేతలు మాత్రం ఏమీ బదులివ్వటం లేదు. కరోనా వైరస్ నేపధ్యంలో కమలంపార్టీ రాజకీయాలను మొదలుపెట్టినట్లుగా అర్ధమైపోతోంది. మరి ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల కమీషన్ ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది. ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ కరోనా వైరస్ టీకా ఉచితం అనే హామీని జనాల్లోకి వదిలిందన్న విషయం తెలిసిపోతోంది. ఎలాగూ అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమే అని ప్రీ ఎలక్షన్ సర్వేలు చెబుతున్నాయి. మరి ఇటువంటి సమయంలో మరీ చీపుగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమిటో కమలంపార్టీకే తెలియాలి.