Begin typing your search above and press return to search.
బీహార్ లో కరోనా వ్యాక్సిన్ ఫ్రీ.. మరి దేశవ్యాప్తంగా?
By: Tupaki Desk | 23 Oct 2020 8:00 AM ISTఇప్పుడు దేశం చూపంతా కరోనా వ్యాక్సిన్ మీదే ఉంది. అదెప్పుడు వస్తుందా.. కరోనా భయాన్ని పోగొడుతుందా.. ఒకప్పట్లా జీవితాలు సాధారణంగా ఎప్పుడు నడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు దేశ ప్రజలు. చాలా దేశాల ప్రజలది ఇదే పరిస్థితి. కరోనా వ్యాక్సిన్ ఎంతైనా సరే వేయించుకోవడానికి కోట్లాదిమంది ఎదురు చూస్తున్నారు. దీన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. ఐతే కొన్ని సంస్థలు సామాజిక కోణంలో ఆలోచించి తక్కువ ధరతోనే వ్యాక్సిన్ వేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతకుముందు సీరమ్ సంస్థ అధినేత చెప్పినదాని ప్రకారం కరోనా వ్యాక్సిన్ ఒక డోస్ ధర రూ.1000కి అటు ఇటుగా ఉండొచ్చు. ఒక్కొక్కరికి రెండు డోస్‌ల వరకు వెయ్యాల్సి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం రెండు వేలు పక్కన పెట్టాల్సి ఉంటుందన్నమాట.
ఐతే ప్రస్తుతం దేశంలోని ఒక రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఆ రాష్ట్రమే బీహార్. అక్కడ అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్‌తో జట్టు కట్టిన బీజేపీ ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా ప్రతి వ్యక్తికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీని ఇచ్చింది. దీన్ని చూసి తమిళనాడు ప్రభుత్వం సైతం ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీని తలకెత్తుకుంది. తమిళనాడు సంగతి పక్కన పెట్టేద్దాం. బీహార్ విషయానికి వస్తే.. అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీనిచ్చింది.
కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆ పార్టీనే కాబట్టి దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. అలా కాని పక్షంలో బీహార్ లో ఎన్నికలున్నాయి కాబట్టి అక్కడ ఓట్ల కోసమే ఈ హామీని ఇచ్చినట్లవుతుంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఆ రాష్ట్రంలో మాత్రమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేసి, మిగతా చోట్ల రాష్ట్రాల మీద భారం మోపితే మాత్రం మోడీ సర్కారుకు కచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది. దీన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రంగా వాడుకుంటాయి. చూద్దాం మరి ఏమవుతుందో?