Begin typing your search above and press return to search.

'ఆరోగ్య శ్రీ ' పరిధిలోకి కరోనా ట్రీట్మెంట్

By:  Tupaki Desk   |   15 Sept 2020 11:45 AM IST
ఆరోగ్య శ్రీ  పరిధిలోకి కరోనా ట్రీట్మెంట్
X
తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని శాసనసభలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ప్రజల్లో కొత్త ఆశలు రేపుతోంది. కరోనా సోకితే ఆస్తులు అమ్మి లక్షల్లో ఫీజులు చెల్లించడం ద్వారా ఇల్లు గుల్ల చేసుకునే ముప్పు తప్పుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి చికిత్సను మెజారిటీ రాష్ట్రాలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోకి తెచ్చాయి. ఏపీలో కూడా కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆరోగ్య పఽథకాలు లేని రాష్ట్రాలు కేంద్రం అమలుచేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్స అందిస్తున్నాయి. కానీ ,రాష్ట్రంలో మాత్రం కరోనా వస్తే పేదలకు సర్కారు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. అక్కడ సరైన వైద్యం లభించదన్న భయంతో పేదల్లో కొందరు, ప్రైౖవేటు ఆస్పత్రుల్లో చేరి లక్షల్లో ఫీజులు చెల్లించుకొని అప్పుల పాలవుతున్నారు.

రాష్ట్రంలో 1.5 లక్షల కేసులు నమోదు కాగా, 40 వేల మంది దాకా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. పొందుతున్నారు. వారిలో ప్రైవేటులో 67 శాతం రోగులుంటే, ప్రభుత్వ దవాఖానల్లో 33 శాతమే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకి సాయంగా నిలవాలన్న లక్ష్యం తో త్వరలోనే కరోనాను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ భారీగా ఫీజులు వసూలు చేస్తున్న ఈ నేపథ్యంలో 77.19 మందికి ఉపయోగంగా మారనుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కింద చేర్చే ముందు ఆస్పత్రులతో ప్రభుత్వం చర్చలు జరపాలి.. అన్ని ఆస్పత్రులకు ఇది సాధ్యం అవుతుందో లేదో శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాకాకుండా అన్ని ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాల్సిందేనంటూ బలవంతంగా మాత్రం రుద్దొద్దు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘం ప్రతినిధి చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 2,058 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,60,571కి పెరిగింది. నిన్న రాత్రి 8 గంటల వరకు మొత్తం 51,247 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 22,20,586కు పెరిగింది. ఇక, గత 24 గంటల్లో కరోనా కాటుకు 10 మంది బలయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు 984 మంది కరోనా కారణంగా మృతి చెందారు.నిన్న ఒక్క రోజే 2,180 మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 1,29,187 మంది వైరస్ బారినుంచి బయటపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంకా 30,400 కేసులు క్రియాశీలంగా ఉండగా, 23,534 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.