Begin typing your search above and press return to search.
మరో ఎంపీకి కరోనా.. చెన్నై అపోలోలో చేరిక
By: Tupaki Desk | 20 Dec 2020 2:00 PM ISTఏపీలో కరోనా అంటేనే ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు. కరోనా మహమ్మారి తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కు కరోనా సోకి జయించి ఆ తరువాత అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ క్రమంలోనే మరో ఏపీ ఏంపీకి కరోనా సోకడం.. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.
ఏపీలో కరోనా తగ్గినట్టే తగ్గి పెరుగుతూ పోతోంది.తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కరోనా బారినపడ్డారు. కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించడంతో శ్రీనివాసులు రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు తెలిసింది. ఈ టెస్టుల ఆధారంగా వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించినట్టు సమాచారం.
దీంతో వెంటనే ఎంపీ మాగుంటను అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం. వైద్యులు మాగుంటను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎంపీ శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఎంపీ శ్రీనివాసుల రెడ్డికి కరోనా అని తేలడంతో అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నాయి.