Begin typing your search above and press return to search.

హమ్మయ్య... కరోనా ముప్పు వారిలో తక్కువేనట

By:  Tupaki Desk   |   10 July 2021 7:00 PM IST
హమ్మయ్య... కరోనా ముప్పు వారిలో తక్కువేనట
X
దాదాపు మూడేళ్ల నుంచి ప్రపంచ మానవాళికి నిద్ర లేకుండా చేస్తుంది కరోనా మహమ్మారి. ధనికులు, పేదవారు, సెలబ్రెటీలు, సినిమా తారలు అనే తేడాలేవీ లేకుండా అందరినీ ముప్పు తిప్పలు పెడుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి కూడా వణికిపోయేలా చేసింది. ప్రస్తుతం ఎవరి మొహాలకు చూసినా.... మాస్కులే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వాలు చెబితే కానీ మాస్కులు పెట్టుకోని జనాలు కరోనా కంగాను ప్రత్యక్షంగా చూసి స్వతహాగా మాస్కులు ధరిస్తున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు రెండో వేవ్ తో అల్లాడిపోయిన జనాలకు ప్రస్తుతం కొంత ఉపశమనం లభించింది. కానీ త్వరలోనే మూడో వేవ్ వస్తుందనే శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో అందరూ కంగారు పడుతున్నారు. రాబోయే థర్డ్ వేవ్ ప్రభావం మొదటి రెండు వేవ్ ల కన్నా భయకరంగా ఉంటుందని హెచ్చరించారు. దీంతో మానవాళి కంటి మీద కునుకు లేకండా భయపడుతూ బతుకుతున్నారు. మరో విషయం ఏంటంటే ఈ థర్డ్ వేవ్ లో అధిక సంఖ్యలో చిన్నారులు ఈ మహమ్మారికి బలవుతారని అందరూ అంటున్నారు. కానీ తాజాగా యూకే శాస్త్రవేత్తలు చెప్పిన విషయం విని చాలా మంది హమ్మయ్య అని అనుకుంటున్నారు. ఇంతకీ వారు ఏం చెప్పారంటే...

మనలో కరోనా మహమ్మారి పాజిటివ్ గా వచ్చేందుకు కారణమయ్యే సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ ప్రభావం చిన్న పిల్లలు టీనేజర్లలో తక్కువగా ఉంటుందని ప్రకటించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలో ఈ విషయాలు వెలుగు చూశాయి. కొంత మంది చిన్నారులను పరిశీలించిన వీరు పిల్లలలో మహమ్మారి ప్రభావం తక్కువేనని స్పష్టం చేశారు. వైరస్ ముప్పు వల్ల పెద్దవారిలాగా పిల్లలు అనారోగ్యానికి గురి కావట్లేదని పేర్కొన్నారు. కానీ బలిష్టంగా ఉన్న పిల్లలకే ఏ ప్రమాదం లేదట. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, యువతపై కరోనా పంజా విసురుతున్నట్లు స్పష్టమయ్యింది.

కాలేజీ ఆఫ్ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్ మరో యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా టీనేజీ పిల్లలపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఏం తెలిసిందంటే ప్రతి 4,81,000 మంది టీనేజర్లలో ఒకరు కరోనా రక్కిసి గురయ్యే ప్రమాదం ఉందట. ఆరోగ్యవంతంగా ఉండి యాక్టివ్ గా ఉన్న పిల్లల మీద కరోనా అంతగా ప్రభావం చూపెట్టదని యూసీఎల్‌ ప్రొఫెసర్‌ రస్సెల్‌ వినెర్‌ పేర్కొన్నారు. కావున కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు తప్పనిసరిగా బలవర్ధక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు.