Begin typing your search above and press return to search.

పిల్లలపై కరోనా థర్డ్‌ వేవ్‌ .. ఎయిమ్స్ డైరెక్టర్ క్లారిటీ !

By:  Tupaki Desk   |   25 May 2021 4:34 AM GMT
పిల్లలపై కరోనా థర్డ్‌ వేవ్‌ ..  ఎయిమ్స్ డైరెక్టర్ క్లారిటీ !
X
కరోనా సెకండ్ విజృంభణ ఇంకా కొనసాగుతుంది. ఈ సెకండ్ వేవ్ వేవ్ ముప్పు పూర్తిగా తొలిగిపోకమునుపే , థర్డ్ వేవ్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణంగా కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం జరగడమే. అయితే దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా స్పందించారు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ఆధారాలేవీ లేవని అన్నారు. పిల్లల్లో పెద్దల మాదిరి త్వరగా వ్యాపించదని, అది వైరస్‌ ఉత్పరివర్తనాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో వ్యాధి సంక్రమణను ఎదుర్కొనే అవకాశం ఉంది, కానీ తీవ్రమైన వ్యాధి కాదని తెలిపారు. మూడవ వేవ్ ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేసే చాలా తక్కువని ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్ జనాభాలో 26 శాతం 14 లోపు వారే కావడం, 7 శాతం ఐదేళ్ల లోపు వాళ్లే కావడంతో.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందనే వార్తలు ఆందోళన కలిగించాయి. మరోవైపు జూన్‌ లో 2 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఏ అనుమతిచ్చిందని కోవాగ్జిన్ ఉత్పత్తి సంస్థ భారత్ బయోటెక్ తెలిపింది. డిసెంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన చివరి సెరో సర్వేలో 10-17 సంవత్సరాల వయస్సులో సోకిన పిల్లల శాతం 25 శాతం ఉందని తేలింది. మొత్తంగా చూస్తే వైరస్‌ సోకిన చిన్నారుల్లో ఎక్కువమందికి చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐఏపీ అసోసియేషన్ అధ్యక్షుడు బాకుల్ పరేఖ్ అన్నారు. అలాగే, చాలా కొద్దిమంది చిన్నారులకు మాత్రమే ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స అవసరమైంది. మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందన్నందున ఈ డేటా ఆధారంగా చికిత్స ప్రణాళికల్లో ప్రాధామ్యాలు నిర్ధరించుకోవడం మంచిదని పిల్లల వైద్య నిపుణులు సూచించారు. కరోనా వైరస్ వల్ల పిల్లల్లో మరణాలు అత్యంత అరుదుగా ఉంటాయని యూరప్‌ లో నిర్వహించిన ఓ సర్వే కూడా తేల్చింది. 582మంది పిల్లలను పరిశీలించగా అందులో ఇద్దరు మాత్రమే మరణించారని, మరో ఇద్దరు తీవ్రమైన ఆరోగ్యసమస్యలు ఎదుర్కొన్నారని ఆ పరిశోధన వెల్లడించింది.