Begin typing your search above and press return to search.
షాపింగ్ మైండ్ సెట్ మార్చేసిన కరోనా.. తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?
By: Tupaki Desk | 16 May 2021 11:00 AM ISTయావత్ ప్రపంచాన్ని.. ప్రపంచ ప్రజల్ని ఒకే కాలంలో.. ఒకేలా ప్రభావితం చేయటం సాధ్యమయ్యే పని కాదు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది కరోనా. కంటికి కనిపించని ఈ మహమ్మారి పుణ్యమా అని.. ప్రపంచ ప్రజల్లో మార్పు కొట్టొచ్చిన్నట్లుగా కనిపిస్తోంది. అన్నింటి కంటే ముఖ్యంగా షాపింగ్ చేసే విషయంలో మార్పు భారీగా వచ్చినట్లుగా తాజాగా నిర్వహించిన సర్వే ఒకటి తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా పదిహేడు దేశాల్లో యుగోవ్ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ప్రజల్లో మారిన షాపింగ్ మైండ్ సెట్ గురించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.
దాదాపు పద్దెనిమిదివేల మంది పాల్గొన్న ఈ సర్వేలో.. అవసరమైన ఫుడ్ ను తప్పించి.. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించినట్లుగా గుర్తించారు. లాక్ డౌన్ విధింపులు.. వైరస్ తీవ్రత పెరిగిపోవటంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం మీదనే ప్రజల ఫోకస్ పెట్టినట్లుగా తేల్చారు. జంక్ ఫుడ్ కంటే కూడా కూరగాయలు.. పండ్లు.. పాల ఉత్పత్తులను డైట్ చార్ట్ లో చేర్చినట్లుగా గుర్తించారు. తమ డైట్ చార్ట్ ను మార్చుకున్నట్లుగా 66 శాతం మంది ప్రజలు అంగీకరించారు. ఇలాంటి పరిస్థితి భారత్ లోనే కాదు.. విదేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. 28 శాతం మంది జంక్ ఫుడ్ తినటం మానేసినట్లుగా ఒప్పుకోవటం గమనార్హం.
భారతదేశానికి వస్తే.. దేశీయంగా 47 శాతం మంది ప్రజలు జంక్ ఫుడ్ ను తినటం తగ్గించినట్లుగా అంగీకరించారు. మిగిలిన దేశాల్లో 15 శాతం మంది ప్యాకేజ్డ్ ఫుడ్ తినటం తగ్గిస్తే.. భారత్ లో ఇది కాస్తా 32 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఆహారం విషయంలో ఇంత మార్పు వచ్చినప్పటికి.. మద్యం తీసుకునే విషయంలో మాత్రం.. గతం కంటే ఎక్కువగా తీసుకోవటం గమనార్హం. భారత్ లో 29 శాతం.. చైనాలో 27 శాతం ప్రజలు గతానికి మించి అధికంగా మద్యం తీసుకున్నట్లుగా చెప్పారు. ఇతర దేశాల వారీలో ఇది పాతిక శాతంగా ఉన్నట్లు తేలింది.
కరోనా నేపథ్యంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్లి కొనుగోలు చేయటం.. సూపర్ మార్కెట్లు.. పెద్ద దుకాణాల కంటే కూడా ఇంటికి దగ్గర్లోని కిరాణా షాపుల్లో కొనుగోలు చేసే ధోరణి అలవాటైనట్లుగా గుర్తించారు. అంతేకాదు.. మహమ్మారి వేళ.. అవసరమైన సరుకులు మాత్రమే కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
కరోనా కారణంగా తమ షాపింగ్ అలవాట్లు మారిపోయినట్లు పలు దేశాలకు చెందిన వారు స్పష్టం చేస్తున్నారు. ఇక.. కాస్మోటిక్స్ వినియోగం భారీగా తగ్గినట్లుగా తేల్చారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లని కారణంగా.. కాస్మోటిక్ ఉత్పత్తుల కొనుగోలు తక్కువగా చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 33 శాతం మంది ప్రజలు బ్యూటీ ప్రొడక్టులను తక్కువగా కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.