Begin typing your search above and press return to search.

ముంచుకొస్తున్న ముప్పు.. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ .. కరోనాతో జాగ్రత్త !

By:  Tupaki Desk   |   23 April 2021 8:30 AM GMT
ముంచుకొస్తున్న ముప్పు.. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ .. కరోనాతో జాగ్రత్త !
X
సెకండ్ వేవ్ లో అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ చాలా చోట్ల రోగులకు సరిపడ బెడ్లు ఉండడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూ వంటి సౌకర్యాలు లేక దయనీయ పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సరైన సమయానికి ఆక్సిజన్ అందక చనిపోతున్నారు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్‌ కొరతతో అల్లాడిపోతుంది. కొవిడ్‌ మహమ్మారి ధాటికి ఆస్పత్రుల పాలైన బాధితులకు ప్రాణవాయువు అందని దుస్థితి. ఆ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా ఏ పూటకాపూటే. అది కూడా వస్తుందో రాదో తెలియదు. వచ్చినా సమయానికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. వలం ఆక్సిజన్‌ కొరత వల్ల వారి ప్రాణాలు కాపాడలేకపోతున్నామన్న బాధతో వైద్యులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైద్యులైతే పేషెంట్ల ను కాపాడలేకపోతున్నామంటూ కన్నీరు పెడుతున్నారు.

ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతపై ఆ రాష్ట్ర హైకోర్టు కేంద్రంపై బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషుల ప్రాణాలంటే ప్రభుత్వానికి అంత ముఖ్యం కానట్టు కనిపిస్తోంది అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఢిల్లీకి ఆక్సిజన్‌ సరఫరాను 378 టన్నుల నుంచి 480 టన్నులకు పెంచినట్టు తెలిపారు. అది అన్ని ఆస్పత్రులకూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేరుతుందని కూడా హామీ ఇచ్చారు. కానీ, పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న హాస్పిటల్స్ కి ఎలాంటి సహాయం అందటం లేదని వాపోతున్నారు. ఢిల్లీ ఆక్సిజన్‌ కోటాను పెంచిన కేంద్రానికి, పెంచడానికి కారణమైన హైకోర్టుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకోసం నవీన్‌ పట్నాయక్‌ ప్రత్యేక అధికారిని నియమించినట్టు కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీకి ఆక్సిజన్‌ కోటాను 480 టన్నులకు పెంచినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన కేజ్రీ.. అది సరిపోదని, తమకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ కావాలని కోరారు.

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల ధర సాధారణంగా 40-50 వేల దాకా ఉంటుంది. ప్రస్తుత డిమాండ్‌ తో ఢిల్లీలో వాటి ధర రూ.లక్ష దాటింది. వైద్యులుగా ఆస్పత్రిలో మేము బాధితుల ప్రాణాలు కాపాడాలి. అలాంటిది.. ఆక్సిజన్‌ కూడా ఇవ్వలేకపోతే ఏమిటి పరిస్థితి? పేషెంట్లు చనిపోతారు. మా దగ్గర ఆక్సిజన్‌ నిల్వలు దాదాపు నిండుకున్నాయి. అందుకోండి అంటూ ఎన్నో హాస్పిటల్స్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. కాబట్టి బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కరోనా వస్తేనే కాదు ... కరోనా తో పోరాడే శక్తి ఉన్నా కూడా ఆక్సిజన్ అందక మరణించే పరిస్థితులు వచ్చాయి. కాబట్టి వీలైనంత వరకు కరోనాతో జాగ్రత్తగా ఉంటూ .. ఇంటి నుండి బయటకి వెళ్లకుండా , కరోనా నియమాలు పాటిస్తూ , చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి.