Begin typing your search above and press return to search.

ఢిల్లీ మళ్లీ మొదలైన కరోనా జోరు .. పెళ్లిళ్లు - మార్కెట్ల పై ఆంక్షలు !

By:  Tupaki Desk   |   18 Nov 2020 5:20 PM IST
ఢిల్లీ మళ్లీ మొదలైన కరోనా జోరు .. పెళ్లిళ్లు - మార్కెట్ల పై ఆంక్షలు !
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో ఇంకా వేల సంఖ్యలోనే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా , ఆ మహమ్మారి మాత్రం అదుపులోకి రావడంలేదు. తాజాగా ఢిల్లీ లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. గత కొన్ని రోజులుగా మళ్లీ కరోనా కేసులు , మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. రోజురోజుకి పాజిటివ్ కేసులు , కరోనా భారిన పడి మరణించే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో మళ్లీ లాక్ డౌన్ సమయంలో అమలు చేసిన కఠిన నియమాలు అమలు చేయాలనే ఆలోచనలో సీఎం కేజ్రీవాల్ ఉన్నారు.

కరోనా లాక్‌ డౌన్ నియమాలకి కేంద్రం సడలింపులు ఇచ్చింది , అయితే , కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మళ్లీ పాత ఆంక్షలను అమలు చేయాలని భావిస్తోంది.ఈ మేరకు ఆంక్షల అమలు నిర్ణయాలపై ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కోరింది. కేంద్రం మార్గదర్శకాల్లో వివాహాది కార్యక్రమాల్లో 200 మంది వరకు పాల్గొనవచ్చు. అయితే పెళ్లిళ్లు, మార్కెట్లే కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. ఈ రెండింటిలోనే ఎక్కువగా జనసమూహాల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీనితో గతంలో అమలు చేసిన 50 మంది వరకు పరిమితిని మళ్లీ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే మార్కెట్లలో రద్దీని నివారించేలా చర్యలు తీసుకుంటుంది. మార్కెట్లకు వెళ్లే సమయంలో మార్కెట్ లో భౌతిక దూరాన్ని పాటించడంలేదు. దీని కారణంగా మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. కరోనా నిబంధనలు పాటించని మార్కెట్లను మూసివేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అనుమతిని ఇవ్వాలని కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. కేంద్రం నుండి వచ్చే స్పందనను బట్టి ఢిల్లీ ప్రభుత్వం ముందుకు సాగనుంది.