Begin typing your search above and press return to search.
చనిపోయిన 11 రోజులకి కరోనా పాజిటివ్ !
By: Tupaki Desk | 3 Aug 2020 11:30 AM ISTఏపీలో కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ప్రతిరోజూ కూడా ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం జగన్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,58,764 మందికి కరోనా సోకింది. అలాగే కరోనా కారణంగా ఇప్పటివరకు 1474 మంది మృతిచెందారు. అయితే కేసులు భారీగా నమోదు కావడానికి మరో కారణం ..దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విదంగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,65,407 టెస్టులు చేశారు.
కరోనా వైరస్ పై ప్రభుత్వం చిత్తశుద్ధి తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి పోతుంటే , కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుంది. తాజాగా ఓ వ్యక్తి చనిపోయిన 11 రోజులకి కరోనా ఫలితం వచ్చింది. దీనిపై ఆవ్యక్తి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడు అని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ప్రకాశం జిల్లా , మార్టూరు మండలం రాజుపాలెం కు చెందిన ఓ వ్యక్తి శ్వాససంబంధ వ్యాధితో బాధపడుతూ 11 రోజుల క్రితం మృతి చెందాడు. ఆ వ్యక్తికి కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆదివారం విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ లో అధికారులు ప్రకటించారు. జూలై 30న నమూనాలను సేకరించి..ఆగస్టు 1న ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఇతను గత నెల 23వ తేదీన వైద్యశాలలో మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.