Begin typing your search above and press return to search.

కరోనా తగ్గినా.. తప్పని దీర్ఘకాల సమస్యలు, లక్షణాలు 200పైనే !

By:  Tupaki Desk   |   16 July 2021 4:16 AM GMT
కరోనా తగ్గినా.. తప్పని దీర్ఘకాల సమస్యలు, లక్షణాలు 200పైనే  !
X
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తో బాధపడేవారిలో 200పైగా శారీరక ఇబ్బందులను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 56 దేశాల్లోని 3762 రోగులను పరిశీలించిన తర్వాత సుదీర్ఘ కరోనా వైరస్ మహమ్మారి కి సంబంధించి మొత్తం 203 లక్షణాలను గుర్తించారు. ఈ-క్లినికల్ మెడిసిన్ అనే జర్నల్‌ లో ఈ వివరాలు ప్రచురితం అయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డ పన్నెండు వారాల తరువాత కూడా బాధితుల్లో శారీరక సమస్యలు కొనసాగడాన్ని వైద్యులు సుదీర్ఘ కరోనా వైరస్ గా చెప్తున్నారు.

కరోనా వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఇటువంటి వారిలో చూపు మసకబారడం, విరేచనాలు, నీరసం, గుండె వేగం పెరిగినట్టు ఉండటం, మూత్రవిసర్జనపై అదుపు లేకపోవడం వంటి 203 రకాల సమస్యలను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. సుదీర్ఘ కొవిడ్ గురించి వైద్య వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ.. ఓ క్రమపద్ధతిలో వాటిపై అధ్యయనం జరగడం మాత్రం ఇదే తొలిసారి అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న డా. అథీనా అక్రమామీ వ్యాఖ్యానించారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో న్యూరో సైంటిస్ట్‌గా డా. అథీనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి సుదీర్ఘ కాల పాటు లక్షణాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. గతంలో ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తుందటంతో నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తూ సుదీర్ఘ కాలంగా బాధపడుతున్నారు. హాస్పిటల్ డేటా, డెత్స్, టెస్టింగ్ ఫిగర్స్, జీపీ రికార్డ్స్ లను ఇన్వెస్టిగేట్ చేసిన ఓఎన్ ఎస్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్న వారు సుదీర్ఘ కాలం ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది. మామూలు వారికంటే కరోనావైరస్ ఉన్న వారికి హార్ట్ అటాక్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటికి 12రెట్లు ఎక్కువగా ఉండే రిస్క్ లు ఉన్నాయని చెబుతున్నాయి.

కరోనా వైరస్ వార్డుల నుంచి సేకరించిన డేటా ప్రకారం.. ఇది కేవలం శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు. మల్టీ సిస్టమ్ డిసీజ్, కొన్నిసార్లు దురదృష్టవశాత్తు దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువే. దీని గురించి నాలెడ్జ్ బేస్ ఉండటంతో పాటు ఎఫెక్టివ్ ట్రీట్‌ మెంట్ స్ట్రాటజీలు ఉండాలి. రోగి పరిస్థితిని బట్టి నీరసం, కండరాల నొప్పులు, జ్వరం వంటి వాటిని గమనించి ట్రీట్‌మెంట్ అందించే విధానం తెలుసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఫ్లూ, కరోనావైరస్ తర్వాత లక్షణాలు కంటిన్యూ అవడమనేది కామన్.. కాబట్టి వైరస్ నెగెటివ్ వచ్చినంత మాత్రాన తగ్గిపోయిందని భావించి నిర్లక్ష్యం వహించకండి.

సుదీర్ఘ కరోనా వైరస్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధుమేహం గురించే. ఎందుకంటే కరోనా వైరస్ సైతం మధుమేహం మాదిరిగా జీవక్రియల సమస్య రూపంలోనూ వేధిస్తోంది. అంతేనా, స్వీయ రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన శరీరం మీద దాడిచేసే స్వభావంతోనూ ముడిపడి ఉంటున్నట్టు తాజాగా బయటపడుతోంది. కాబట్టే కరోనా లోనూ మధుమేహ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాజబ్బు బారినపడ్డవారిలో కొత్తగా మధుమేహం తలెత్తుతుండటం, గ్లూకోజు స్థాయులు మరీ ఎక్కువగా లేకపోయినా మధుమేహంలో మాదిరిగా రక్తంలో ఆమ్ల స్థాయులు విపరీతంగా పెరిగిపోతుండటం మనకు తెలిసిందే. ఇలాంటి ప్రభావాలు ఉద్ధృత దశలోనే కాదు.. 21 రోజుల తర్వాతా కనిపిస్తుండటం గమనార్హం. కరోనా వైరస్ తో గానీ స్టిరాయిడ్ల వాడకంతో గానీ కొత్తగా మధుమేహం బారినపడ్డ కొందరిలో మూత్రపిండాలు, కాలేయం పనితీరు తాత్కాలికంగా అస్తవ్యస్తం కావటమూ సమస్యగా పరిణమిస్తోంది. ఇది హఠాత్తుగా గ్లూకోజు స్థాయులు పడిపోవటానికీ దారితీస్తోంది.