Begin typing your search above and press return to search.
ఆర్మీ హాస్పిటల్ లో కరోనా కలకలం..24 మందికి పాజిటివ్!
By: Tupaki Desk | 5 May 2020 6:30 PM ISTకరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా అలజడి సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఢిల్లీ లోను ఆర్మీ ఆసుపత్రి లో 24 మందికి కరోనా నిర్దారణ అయినట్టు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సైనిక ఉద్యోగులకు వైరస్ సోకినట్లు మంగళవారం అధికారులు వెల్లడించారు. వైరస్ సోకిన వారందరినీ ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అలాగే మరోవైపు ఐటీబీపీలోనూ కరోనా అలజడి రేపుతోంది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగానికి చెందిన 45 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇప్పటివరకు ఢిల్లీలోనే విధులు నిర్వర్తించినట్లు వెల్లడించారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కాగా, ప్రస్తుతం దేశంలో 32,138 యాక్టివ్ కేసులు ఉండగా... 12,727 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 1020 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా భారత్ లో ఇప్పటివరకు 1568 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3900 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 195 మంది మరణించారు.