Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   3 Jan 2022 12:01 PM IST
బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
X
తెలంగాణలో కరోనా కల్లోలం మొదలైనట్టే కనిపిస్తోంది. ఒమిక్రాన్ చాపకింద నీరులా పాకుతోంది. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ కోరలు చాస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. సామాన్యులతోపాటు ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కరోనా బారినపడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని సోమవారం ఉదయం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా కొద్దిరోజులుగా తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

తెలంగాణలో ఆదివారం 21679 మందికి కరోనా పరీక్షలు చేయగా తాజాగా 274 మందికి పాజిటివ్ గా తేలింది. పాజిటివిటీ రేటు 1.26 శాతంగా నమోదైంది. తెలంగాణలో థర్డ్ వేవ్ దిశగా పరిణామాలున్నాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.