Begin typing your search above and press return to search.

సింహాలకు కరోనా పాజిటివ్.. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం..!

By:  Tupaki Desk   |   20 May 2021 7:00 AM IST
సింహాలకు కరోనా పాజిటివ్.. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యం..!
X
కరోనా మహమ్మారి మనుషులే కాదు జంతువులపై ప్రభావం చూపుతోంది. దేశంలోని పలు జూపార్కుల్లోని జంతువులకు వైరస్ నిర్ధారణ అయింది. కాగా ఉత్తరప్రదేశ్ లోని రెండు సింహాలకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వాటి పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

యూపీలోని ఎటావాకు చెందిన లయన్ సఫారిలోని గౌరీ, జెన్నిఫర్ అనే సింహాలకు కరోనా సోకింది. అప్పటి నుంచి వీటి ఆరోగ్యం క్షీణిస్తోందని సఫారి నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి అవి ఆహారం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ద్రవ రూపంలో గ్లూకోజును అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యుల సలహాలతో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ఇంకా కరోనా నెగిటివ్ రిపోర్ట్ రాలేదని సఫారి డైరెక్టర్ కృష్ణ కుమార్ సింగ్ వెల్లడించారు. సఫారీలోని 18 సింహాలకు పరీక్షలు చేయగా రెండింటికి వైరస్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. మిగతా 16 సింహాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వాటితో పాటు ఎలుగు బంటి, చిరుతపులి, రైన్ డీర్లలో ఎటువంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు.

జంతువులకు కరోనా సోకకుండా జాగ్రత్త వహిస్తున్నామని తెలిపారు. గౌరీ, జెన్నిఫర్ సింహాలు త్వరగా కోలుకునేందుకు సాధ్యమైనంతగా కృషి చేస్తామని తెలిపారు. కొవిడ్ మహమ్మారి కబందహస్తాల నుంచి మనుషులను, జంతువులను కాపాడుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది.