Begin typing your search above and press return to search.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ !
By: Tupaki Desk | 10 Aug 2020 3:20 PM ISTదేశంలో కరోనా వైరస్ విజృంభణ గణనీయంగా పెరిగిపోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సామాన్యుల నుండి ప్రముఖులు వరకు ..అందరూ కరోనా మహమ్మారి బారినపడుతుండం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకోగా తనకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. తనకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన నేపథ్యంలో ఇటీవల తనను కలిసిన వారు కూడా ఐసొలేషన్ లో ఉండి, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్ లో ఉంటూ ప్రణబ్ ముఖర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.
