Begin typing your search above and press return to search.

బొలీవియా అధ్య‌క్షురాలికి తాకిన క‌రోనా సెగ!

By:  Tupaki Desk   |   10 July 2020 11:45 AM IST
బొలీవియా అధ్య‌క్షురాలికి తాకిన క‌రోనా సెగ!
X
కరోనా వైరస్ సామాన్యుల నుండి దేశాధ్య‌క్షుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. రోజురోజుకి వైరస్ వ్యాప్తిని విస్తరించుకుంటూపోతూ అందరిలో ఆందోళన పెంచుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో ప్రముఖులు కూడా కరోనా భారిన పడగా తాజాగా బొలీవియా తాత్కాలిక అధ్య‌క్షురాలు జీనిన్ అనెజ్‌ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. త‌నకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని , అయితే ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఐసోలేష‌న్ ‌లో ఉండి ప‌ని చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు.

ఇటీవల జీనిన్‌ అనెజ్‌‌ మంత్రివర్గంలో నలుగురు మంత్రులుకు కరోనా పాజిటివ్‌ గా తేలింది. దీనితో కరోనా అనుమానంతో అధ్యక్షురాలు జీనిన్‌ అనెజ్‌‌కు కూడా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యిందని జీనిన్‌ అనెజ్‌ ప్రకటించారు. బొలీవియాలో సాధారణ ఎన్నికలకు ముందు ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు కరోనా సోకడం గమనార్హం. అక్కడ సెప్టెంబర్‌ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దక్షిణ అమెరికాలో కరోనా సోకిన దేశాధ్యక్షుల సంఖ్య రెండుకు చేరింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని మంగళవారం ప్రకటించారు. మ‌రోవైపు లాటిన్ అమెరికాలోని వెనిజులా రాజ్యాంగ అసెంబ్లీ అధ్య‌క్షుడు డియోస్‌ డాడో కాబెల్లో సైతం క‌రోనా భారిన పడ్డారు. ఆ దేశ అధ్య‌క్షుడు నికోల‌స్ మాడ్యురో త‌ర్వాత అత్యంత శ‌క్తివంమైన వ్య‌క్తిగా కాబెల్లో గుర్తింపు పొందారు.